Advertisement
Google Ads BL

క్రిష్ డ్యూటీ కంగనా చేస్తోంది


క్రిష్ డైరెక్షన్ లో ఝాన్సీ రాణి జీవిత కథగా తెరకెక్కుతున్న 'మణికర్నిక' సినిమాలో టైటిల్ రోల్ లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరిలో రిలీజ్ చేస్తున్నాం అని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇంతవరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వలేదు. కొంత ప్యాచ్ వర్క్.. కొన్ని సీన్స్ బాలన్స్ ఉన్నాయి. కానీ క్రిష్ మాత్రం ఈ సినిమాను పట్టించుకోకుండా 'ఎన్టీఆర్' బయోపిక్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

అందువల్ల ఆ ప్యాచ్ వర్క్...బాలన్స్ సీన్స్ ను హీరోయిన్ కంగనా తీసేస్తుందంట. ఎంత జాగ్రత్త పడినా ఈ న్యూస్ మీడియాకు లీక్ అయ్యి వైరల్ అవుతుంది. వాస్తవానికి ఈ సినిమాకు మొదట డైరెక్టర్ క్రిష్ కాదు. కొన్ని కారణాలు వల్ల క్రిష్ ను తీసుకుంది. అయితే క్రిష్ సినిమా మొత్తం దాదాపు ఫినిష్ చేశాడు కానీ ప్యాచ్ వర్క్ మాత్రం ఫినిష్ చేయకుండా హైదరాబాద్ కు వచ్చేసి 'ఎన్టీఆర్' బయోపిక్ ను తీస్తున్నాడు.

అయితే ఇప్పుడు ఈ న్యూస్ పై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌, గ్రాఫిక్స్‌ వర్క్‌ మొత్తం కంగనే చూసుకుంటోంది. పైగా ఆమె ఫిలిం డైరెక్షన్ కోర్స్ చేశానంటూ చెబుతుంది. మరి  డైరెక్టర్ క్రిష్ కు ఇవన్నీ తెలిసే వదిలేసాడా?....లేక ఈ విషయాలు క్రిష్ కు తెలియలేదా? అన్న విషయాలు తెలియాల్సిఉంది. ఏదైతేనేం అనుకున్న టైంకి మన ముందుకు 'మణికర్నిక' వచ్చేస్తుంది.

Advertisement
CJ Advs

Kangana ranaut directs manikarnika patch work:

Kangana takes director krish duty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs