Advertisement
Google Ads BL

కేరళకి తనవంతు సాయం అందిస్తున్న స్టార్‌!


కేరళలో జరిగిన వరద భీభత్సం గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజల జీవితాలను చిన్నాబిన్నం చేసింది. దీనిపై మన తెలుగు హీరోలే కాదు.. కోలీవుడ్‌ హీరోలు కూడా బాగా స్పందిస్తూ మేము సైతం అంటూ ముందుకు వస్తున్నారు. ఇక విషయానికి వస్తే కేరళకు సాయంగా కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ ఏకంగా 14కోట్లు విరాళం ఇచ్చాడని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తెలిసిపోయింది. విజయ్‌ తన వంతు సాయంగా 70లక్షల విరాళం ప్రకటించాడు. అయితే దీనిని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి ఇవ్వకుండా తన అభిమాన సంఘాల వారి ద్వారా నేరుగా సాయం అందిస్తుండటం నిజంగా విశేషం.

Advertisement
CJ Advs

ఎందుకంటే ఇలా విరాళాలు ఇచ్చే సొమ్ము రాజకీయ నాయకులు శవాలపై చిల్లర ఏరుకునే వారి వల్ల పూర్తిగా బాధితులకు చేరుతాయన్న నమ్మకం లేదు కాబట్టే విజయ్‌ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు నుంచి కేరళకు విజయ్‌ తన విరాళంతో ఆహారపదార్దాలు, దుస్తులు, దుప్పట్లు, పాలపొడి, శానిటరీ నాప్‌కిన్స్‌, మందులు, ఇతర ముఖ్యమైన వస్తువులను ట్రక్‌లో తరలిస్తున్నాడు. ఇలా చూస్తే ఈ బడా బడా రాజకీయనాయకులు, బిజినెస్‌ మాగ్నేట్ల కంటే సినిమా వారే ఇలాంటి విషయాలలో ముందుండటం హర్షించదగ్గ విషయమనే చెప్పాలి.

Vijay donates Rs 70 lakh worth relief materials to Kerala flood victims:

Thalapathy Vijay donate Rs 70 lakh for Kerala flood relief
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs