నిప్పులేనిదే పొగరాదు అంటారు పెద్దలు. అయితే గత అనుభవాలు, వారి ప్రవర్తనను బట్టి కొన్నింటిని ప్రజలు నమ్ముతారు. దీనికి కారణం పాతకాలంలో ఆయా వ్యక్తులు చేసిన పనులే దీనికి కారణం. ఇక విషయానికి వస్తే 'అందాలరాక్షసి' ద్వారా తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత 'సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్' వంటి బ్లాక్‌బస్టర్స్‌లో నటించింది. ఈమె తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. తమిళంలో '100%లవ్'కి రీమేక్‌గా రూపొందుతున్న '100%కాదల్' సినిమాని చేస్తానని ముందు ఒప్పుకుని, ఆ తర్వాత ఎలాంటి కారణం లేకుండా సినిమా నుంచి తప్పుకున్న కారణంగా తమకు చాలా నష్టం జరిగిందని ఆ చిత్ర నిర్మాతలు తమిళ నిర్మాతల మండలిలో కూడా ఫిర్యాదు చేశారు. దాని ప్రభావం వల్ల ఆమె వ్యవహారశైలి ఇంతేనన్న ముద్ర పడిపోయింది.
అందుకే ఆమె తాజాగా 'తొలిప్రేమ, గీతగోవిందం' వంటి చిత్రాలను కూడా వదులుకోవడం జరిగిందని ప్రచారం జరిగింది. 'గీతగోవిందం' విషయంలో లావణ్యత్రిపాఠినే ముందుగా అనుకున్నామని దర్శకుడు పరశురాం కూడా అంగీకరించాడు. కానీ ఈ భామ అవ్వన్నీ ఫేక్ వార్తలంటూ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నా గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను. నా మీద వస్తున్న గాసిప్స్‌కి నేను మౌనంగా ఉన్నానంటే దాని అర్ధం మీఇష్టం వచ్చినట్లు మాట్లాడమని కాదు' అని గట్టిగా హెచ్చరించింది. ఇక ఈమె ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటంటే.. శృతి అనే నెటిజన్ లావణ్యత్రిపాఠి వదిలేసిన రెండు చిత్రాలు బ్లాక్‌బస్టర్స్ అయ్యాయని పేర్కొంది. ఈ రెండు చిత్రాలను లావణ్య వదిలేసింది అని చేసిన ట్వీట్‌పై అందాల రాక్షసి మండిపడింది. ఇది ఫేక్ న్యూస్. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను అంటూ ట్వీట్ చేసింది.
సినిమా ఫీల్డ్ అన్నతర్వాత మరీ ముఖ్యంగా హీరోయిన్లపై గాసిప్స్ రావడం కామన్. దీనిని పట్టుకుని మరింతగా రెచ్చిపోతే అనవసరంగా వాటిని పెంచి పోషించడమే అవుతుంది. ఇక ప్రస్తుతం లావణ్యత్రిపాఠి దీనిని లైట్‌గా తీసుకోకుండా అంతలా ఎందుకు ప్రతిస్పందించింది? అన్నదే పాయింట్. ఇక ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న తమిళ రీమేక్ 'కణితన్' తెలుగువెర్షన్ 'ముద్ర'తో పాటు వరుణ్‌తేజ్ హీరోగా 'ఘాజీ' సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'అంతరిక్షం'లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది.