Advertisement
Google Ads BL

అబ్బో.. మహేష్‌బాబేనా..?


భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు యంగ్ లుక్ తో సీఎం గా అదరగొట్టాడు. కొరటాల డైరెక్షన్ లో మహేష్ చేసిన రెండు సినిమాల్లో మహేష్ బాబు చాలా యంగ్ గా డీసెంట్ గా క్లాసీ లుక్ లోనే కనబడ్డాడు. ఈ వయసులోనూ మహేష్ తన అందంతో.. తన వయసుని తగ్గించేసుకుంటున్నాడు. ప్రస్తుతం వంశి పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహేష్ కెరీర్ లో మైలురాయి అయిన మహర్షి సినిమాలోను మహేష్ స్టూడెంట్ గా యంగ్ లుక్స్ తోనే అందరిని మెస్మరైజ్ చేసాడు. ఇప్పటికే విడుదలైన మహర్షి లో మహేష్ లుక్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది.

Advertisement
CJ Advs

తాజాగా మహేష్ బాబు మహర్షి సినిమాలోని లుక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మహర్షి లొకేషన్ నుండి మహేష్ లుక్ ఒకటి లీకైంది. ఆ లీకెడ్ ఫొటోస్ లో మహేష్ బాబు చాలా అంటే చాలా యంగ్ అండ్ హ్యాండ్‌సమ్‌‌‌గా అదరగొడుతున్నాడు. మరా న్యూలుక్‌ లో మహేష్ ని చూసిన ప్రిన్స్ అభిమానులు మహేష్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా మహర్షి సినిమాలో డ్యూయల్ రోల్ ఏమైనా చేస్తున్నాడా అంటూ డౌట్ క్రియేట్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో మహేష్ బాబు మహర్షిగా, రిషి గా రెండు రోల్స్ ప్లే చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది.

ఇకపోతే డెహ్రాడూన్, గోవాలలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వంశి పైడిపల్లి టీమ్ ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగ్ ని హైదరాబాద్ నడిబొడ్డులో... అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అది కూడా మహర్షి ఫ్యామిలీకి సంబందించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టుగా చెబుతున్నారు. మరి ఈ సినిమాలో మహేష్ తల్లిగా అలనాటి టాప్ హీరోయిన్ జయప్రద నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా... దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Mahesh Babu's Latest Look in Leaked Pic:

Leaked Pic: Mahesh Develops Thickest Beard<br />
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs