Advertisement
Google Ads BL

నాటి చిరు గుర్తుకు వస్తున్నాడు..!


చిరంజీవి కెరీర్‌లో ఎన్నో సంచలనాలు ఉన్నాయి. అప్పటివరకు ఉన్న యాక్షన్‌సీన్స్‌కి, పాటల్లో స్టెప్స్‌లో వేగం పెంచి, రియల్‌ ఫైట్స్‌ చేయడం ద్వారా ఆయన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి తెలుగు సినిమా ట్రెండ్‌నే మార్చివేసిన ఘనత ఆయనది. ఇక చిరంజీవి విషయానికి వస్తే ఆయన బైక్‌ రైడింగ్‌ వంటివి నాటి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇక బ్రేక్‌డ్యాన్స్‌లు, 'ఖైదీ'లో స్నేక్‌ డ్యాన్స్‌ల ద్వారా ఆయన సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. యాక్షన్‌, డ్యాన్స్‌ల్లో స్పీడుని పెంచిన ఘనత ఆయనకే సొంతం.

Advertisement
CJ Advs

ఇక 'గూండా' చిత్రం నడిచే రైలు కింద రాడ్డును పట్టుకుని చేసిన సీన్స్‌తో పాటు ఎన్నో చిత్రాలలో ఆయన చేసిన బైక్‌ విన్యాసాలు, రియల్‌ఫైట్స్‌ జనాలను రంజింపజేశాయి. ఇక చిరంజీవి గుర్రపుస్వారీ ద్వారా కూడా ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపారు. ఆయన నటించిన 'సింహపురి సింహం, కొదమసింహం, శివుడు శివుడు శివుడు, వేట, కొండవీటి దొంగ' వంటి చిత్రాలలో ఆయన గుర్రపుస్వారీ చేశాడు. ఇప్పుడు మరోసారి ఆయన గుర్రపుస్వారీ చేస్తూ 'సైరా.. చిత్రం మొదటి టీజర్‌లో కనిపిస్తున్నాడు. తెల్ల దొరలపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ, గుర్రంపై వాళ్లపైకి దూసుకురావడం హైలైట్‌గా నిలిచింది. ఈ లుక్‌ని చూస్తే నాటి 'వేట' చిత్రంలోని చిరు గెటప్‌ గుర్తుకు వస్తోంది. ఇక 'వేట' చిత్రం డిజాస్టర్‌ చిత్రం. అది వేరే సంగతి. ఇక ఈ టీజర్‌లో ఆయన చెప్పిన ఈ యుద్దం ఎవరిది?.. మనది అని చెప్పిన డైలాగ్‌ సినిమా విడుదల వరకు అభిమానులు గుర్తుపెట్టుకునేలా పవర్‌ఫుల్‌గా ఉంది.

ఇక ఈ టీజర్‌ని చూసిన నేచురల్‌స్టార్‌ నాని 'ఈ చిత్రం ఎవరిది? మనది' అంటూ తన హర్షాన్ని వ్యక్తం చేశాడు. ఇక నయా స్టార్‌గా మారిన విజయ్‌దేవరకొండ మాట్లాడుతూ, టీజర్‌ కిర్రాక్‌గా ఉందిలే అంటూ తన స్టైల్‌లో స్పందించాడు. ఈ చిత్రం సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయాన్ని అనసూయ వ్యక్తం చేసింది. సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌లు ఇద్దరు ఈ చిత్రం టీజర్‌ అద్భుతంగా ఉందని, సినిమా విడుదల వరకు వెయిట్‌ చేయడం కష్టమంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Celebrities Reaction on Sye Raa Teaser :

Mega Star Sye Raa Teaser Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs