Advertisement
Google Ads BL

'పేపర్‌బాయ్'కి సీఎం భరత్ సపోర్ట్!


సంపత్ నంది టీమ్ వర్క్ నుండి జయశంకర్ డైరెక్టర్ గా సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన 'పేపర్ బాయ్' సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా వుంది. ముందుగా 'పేపర్ బాయ్' ని సెప్టెంబర్ 7 న విడుదల చేయాలనుకున్నారు. కానీ నాగ చైతన్య 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ఆగష్టు 31 నుండి తప్పుకోవడంతో.. సంపత్ నంది పేపర్ బాయ్ ని ఆగష్టు 31 నే అంటే శైలజా రెడ్డి విడుదలవుతుంది అనుకున్న రోజుకి ప్రీ పోన్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. అయితే మంచి అంచనాల మధ్యన విడుదలవుతున్న 'పేపర్ బాయ్' కి ఇప్పుడు మహేష్ బాబు చేసిన ట్వీట్ మరింత బూస్ట్ నిచ్చింది.

Advertisement
CJ Advs

మహేష్ బాబు శోభన్ కొడుకు సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న 'పేపర్ బాయ్' ట్రైలర్ ని వీక్షించి 'పేపర్ బాయ్' సినిమా ట్రైలర్ చూశానని.. చాలా ఫ్రెష్‌గా.... ప్లెజెంట్‌గా అనిపించిందని మహేష్ ట్వీట్ చెయ్యడమే కాదు... 'పేపర్ బాయ్' సినిమా  బాగా ఆడాలని మహేష్ కోరుకుంటున్నాడు. మరి మహేష్ ఈ మధ్యన చిన్న సినిమాలకు, తనకి నచ్చిన సినిమాలను... ట్రైలర్స్ అలాగే సినిమాలు విడుదలయ్యాక సినిమాలు చూసి ఆయా సినిమాల టీమ్స్ ని సోషల్ మీడియాలో తనదైన శైలిలో అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు 'పేపర్ బాయ్' సినిమాకి మహేష్ ప్రత్యేకించి విషెస్ ఎందుకు చెప్పాడు అంటే.. 'పేపర్ బాయ్' హీరో సంతోష్ శోభన్ తండ్రి శోభన్ తో మహేష్ బాబు రెండు మూడు సినిమాలకు కలిసి పనిచేయడంతో... శోభన్ మీదున్న అభిమానంతోనే మహేష్ ఇప్పుడు శోభన్ కొడుకు సంతోష్ శోభన్ సినిమా 'పేపర్ బాయ్' బాగా ఆడాలని కోరుకుంటున్నాడు.

Mahesh Babu Praises Paper Boy Trailer:

Mahesh Emotional @ Paper Boy Trailer<br />
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs