Advertisement
Google Ads BL

నర్తనశాలలో ఆ మ్యాటర్ కూడా ఉందండోయ్..


ఛలో సినిమా తో డీసెంట్ హిట్ అందుకున్న నాగ శౌర్య మళ్ళీ తన ఓన్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ లోనే 15 కోట్ల బడ్జెట్ తో నర్తనశాల సినిమా చేస్తున్నాడు. మోడ్రెన్ గే గా నాగ శౌర్య ఈ సినిమా లో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద మరీ భీభత్సమైన అంచనాలైతే లేవు. ఎందుకంటే ఛలో సినిమా హిట్ అయినప్పటికీ.. ఆ తర్వాత నాగ శౌర్య నటించిన కణం సినిమాతో పాటు అమ్మమ్మగారిల్లు అంతంత మాత్రంగానే ఆడాయి. అయితే ఆ సినిమాలకు ప్రమోషన్స్ లో చేసిన అశ్రద్ధ వలన రెండు సినిమాలు హిట్ అయినా యావరేజ్ కి పడిపోయాయి. అందుకే నర్తనశాల సినిమా విషయంలో నాగ శౌర్య పబ్లిసిటీ లో కొద్దిగా స్టయిల్ మార్చి మరీ ప్రమోషన్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఈ నెలాఖరున విడుదలకాబోయే నర్తనశాల సినిమా పాటలను ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి వదులుతూ హైప్ క్రియేట్ చేస్తుంది చిత్ర బృందం. అందులో తాజాగా వదిలిన ఒక పాట మాత్రం సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. సినిమాల్లో హీరో మీద వచ్చే పాటకు ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో... రొమాంటిక్  సాంగ్స్ కి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. అందులోను బీచ్ సాంగ్స్ కి మరీ ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇక బీచ్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ తెరకెక్కించాలి అంటె గనక టాలీవుడ్ లో దర్శకుడు కృష్ణ వంశీకి ఒక స్టయిల్ ఉంటుంది. అయితే కృష్ణ వంశీ శిష్యుడు శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి ఈ నర్తనశాల సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. మరి గురువు గారి స్టయిల్ ని ఈ శిష్యుడు శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి యాజ్ టీజ్ గా ఫాలో అవుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా వదిలిన సాంగ్ పిచ్చిపిచ్చిగా న‌చ్చావురా మ‌నోహ‌రా.... చూస్తుంటే ఈ సినిమాలో ఈ స్థాయి రొమాంటిక్ టైపు సాంగ్ ఉంటే.... సినిమాకి ఇంతకన్నా ఏం కావాలని అన్నట్లుగా ఉందా రొమాంటిక్ సాంగ్.

మరా పాటను దర్శకుడు శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి తెరకెక్కించిన తీరు... ఆ పాటలో క‌ళ్ల‌జోడు పెట్టుకున్న నాగ‌శౌర్య బుద్దిమంతుడిలా కనిపిస్తుంటే.. త‌డి బ‌ట్ట‌ల‌తో యామిని.. చాలా చాలా హాట్ హాట్‌గా క‌నిపిస్తోంది. ఇక ధ‌ర‌మ్ తేజ్ రాసిన ఈ పాట పాడిన లిప్సిక కూడా ఈ పాట పాటను తనదైన స్టయిల్లో హాట్ హాట్ లిరిక్స్ తో చేసిన హంగామా అన్ని సూపర్ అనిపించేలా ఉన్నాయి.మరి ప్రస్తుతం హాట్ హాట్ లిప్ లాక్ కిస్సులకి, హాట్ హాట్ అందాలకు యూత్ ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతున్నారో అర్జున్ రెడ్డి, RX 100 నిరూపించాయి. మరి నర్తనశాల కూడా ఈ సాంగ్ తో బాగా హైప్ క్రియేట్ అయ్యి సినిమాకి ఈ పాట ప్లస్ అవుతుందనిపిస్తుంది.

Romantic Song From Narthanasala Released:

Romance Full in Narthanasala movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs