Advertisement
Google Ads BL

త్రీ కాదు.. ఇంకో ఇడియట్ పెరిగాడు..!


నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకం పై కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి మరియు రుచి హీరో హీరోయిన్స్ గా సతీష్ కుమార్ శ్రీరంగం స్వీయదర్శకత్వంలో నిర్మించబడిన చిత్రం 4 ఇడియట్స్. ఈ చిత్రానికి సంభందించిన ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. అగ్ర నిర్మాత సి. కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసి 4 ఇడియట్స్ ఆడియోను విడుదల చేసారు.

Advertisement
CJ Advs

అనంతరం సి కళ్యాణ్ మాట్లాడుతూ..ఈ సినిమాలో అందరు కొత్తవాళ్లు నటించారు. దర్శక నిర్మాత సతీష్ కుమార్ శ్రీరంగం నాకు బాగా పరిచయం. చిన్న సినిమాలు విడుదల చాలా కష్టం, వారానికి 6 సినిమాలు విడుదలవుతున్నాయి కానీ జనం థియేటర్ కి రావటం లేదు. చాలా బాధగా ఉంది. కానీ నిర్మాత సతీష్ కి డిస్ట్రిబ్యూషన్ మీద మంచి పట్టు ఉంది. అతనికి చాలా అనుభవం ఉంది. ఖచ్చితంగా ఈ సినిమా విడులవుతుంది. ఈ 4 ఇడియట్స్ విడుదలై మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు. 

కార్పొరేటర్ సంజయ్ గౌడ్ మాట్లాడుతూ.. దర్శక నిర్మాత సతీష్ గారు చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ద్వారా చాలా మంది కొత్తవాళ్లకు అవకాశం కల్పించారు. ఈ సినిమా మంచి విజయం కావాలి.. అని కోరుకున్నారు. 

తుమ్ములపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నో ఆశలు పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చే కొత్తవాళ్ళకి మార్గదర్శం మా సతీష్ కుమార్ శ్రీరంగం. ఈరోజుల్లో చిన్న సినిమా అంటే చాలా కష్టం అలాంటిది మా సతీష్ అందరు కొత్తవాళ్లతో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఓపెనింగ్ కి నేను వచ్చాను, ఇప్పుడు ఆడియో విడుదల వేడుక జరుగుతుంది. అలాగే ఈ సినిమా కూడా విడుదలై మంచి విజయకావాలి. యూనిట్ సభ్యులందరికి నా శుభాకాంక్షలు.. అని తెలిపారు. 

సాయి వెంకట్ మాట్లాడుతూ..చాలా తక్కువ సమయంలో ఈ 4 ఇడియట్స్ సినిమా నిర్మించారు మా సతీష్ కుమార్ శ్రీరంగం గారు. అయన మంచి టాలెంట్ ఉన్న నిర్మాత దర్శకుడు. ఎన్నో సినిమాలను విడుదల చేసారు. అవి మంచి హిట్ అయ్యాయి. ఈ సినిమా కూడా మంచి విజయం కావాలి.. అని కోరుకున్నారు. 

మ్యూజిక్ డైరెక్టర్ జయ సూర్య మాట్లాడుతూ.. సినిమా పేరు 4 ఇడియట్స్ కానీ ఈ సినిమాకి పని చేసిన టెక్నీషియన్ అందరు మంచి ఇంటెలిజెంట్. సినిమా చాలా  బాగా వచ్చింది. మంచి పాటలు ఉన్నాయ్. అందరికి నచుతుంది.. అని కోరుకున్నారు. 

దర్శక నిర్మాత సతీష్ కుమార్ శ్రీరంగం మాట్లాడుతూ.. ప్రభుదేవాగారు నటించిన లక్ష్మి సినిమా ఈ వారం రిలీజ్ ఉన్నా.. సి కళ్యాణ్ గారు చాలా బిజీ గా ఉన్న నా సినిమా ఆడియో విడుదల చేయటానికి విచ్చేసిన ఆయనకి నా కృతఙ్ఞతలు. ఈ సినిమాలో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ నటీనటులు అందరు కృష్ణనగర్ లో ఉన్నవారే. గతంలో నేను చాల మంది కొత్తవాళ్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాను. చాలా మంది సక్సెస్ అయ్యారు. మంచి పరిచయాలు ఉన్న నేను ఇప్పటివరకు 14 చిన్న  సినిమాలు తెలుగు,తమిళం, మలయాళం భాషల్లో  చేశాను అవి మంచి విజయం సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉంది. పాటలు చాలా బాగున్నాయి. ఒకపుడు ఇండస్ట్రీలో ఎవరికైన భాధ ఉంటే మన దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు ఉన్నారు. ఇప్పుడు మన సినీరత్న సి కళ్యాణ్ గారు ఉన్నారు. అందరు చిన్న సినిమా నుంచే వచ్చారు. ఈ 4 ఇడియట్స్ మంచి కథ, కొత్త వాళ్ళతో తీసాను. మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్. వచ్చే నెల విడుదలకు సన్నాహాలు చేస్తున్నాను..అని అన్నారు. 

నటీనటులు : కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి, రుచి, జబర్దస్త్ రైసింగ్ రాజు, గణపతి, జూనియర్ రాజశేఖర్, సుధీర్, నాగు, విజయ్ కుమార్, మాస్టర్ శ్రీశాంత్ 

బ్యానర్ : నాగార్జున సినీ క్రియేషన్స్ 

సంగీతం : జయ సూర్య, డాన్స్ : వినోద్, ఫైట్స్ : శ్యామ్, ఎడిటర్ : సెల్వ కుమార్, కెమెరా : నగేష్, ఆర్ట్ : విజయ్ కృష్ణ, పాటలు (టైటిల్ సాంగ్) : కొమ్ము యాదయ్య , కథ, కథనం, దర్శకత్వం, నిర్మాత : సతీష్ కుమార్ శ్రీరంగం 

4 Idiots movie Audio Released:

4 Idiots movie Audio Launch Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs