Advertisement
Google Ads BL

క్యాస్టింగ్‌కౌచ్ ఉంది: ‘ఆర్‌ఎక్స్‌100’ హీరోయిన్!


ఇటీవల అతి చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘ఆర్‌ఎక్స్‌100’. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌ ‘ఇందు’ అనే నెగటివ్‌రోల్‌ని పోషించింది. అదొక స్ట్రాంగ్‌ క్యారెక్టర్‌. వ్యక్తిగతంగా నేను కూడా చాలా స్ట్రాంగ్‌. అయితే ‘ఇందు’ వంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని మాత్రం ఇష్టపడను అని ఆమె అంటోంది. ఈమె ఇంకా మాట్లాడుతూ.. తెలుగులో కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. ఇది నన్ను బాగా డిజప్పాయింట్‌ చేసింది. ‘ఆర్‌ఎక్స్‌100’ చిత్రం వచ్చి ఘనవిజయం సాధించిన తర్వాత కూడా నన్ను కాంప్రమైజ్‌ కావాలని అడుగుతున్నారు. ఈమాటను తప్పకుండా పబ్లిష్‌ చేయండి. క్యాస్టింగ్‌కౌచ్ గురించి నేను చాలా షాక్‌కి గురయ్యాను. ఇలాంటి ప్రపోజల్‌తో నాలుగురోజుల కిందనే ఓ వ్యక్తి వచ్చి కలిశాడు. బహుశా మొదటి చిత్రంలోనే బోల్డ్‌ క్యారెక్టర్‌ చేయడం వల్ల వారు అలా అనుకుంటున్నారేమో! ఇక్కడ నేను టాలెంట్‌తో నిలబడ్డానే గానీ వేరే తప్పుడు పద్దతుల వల్ల మాత్రం కాదు. పుట్టింది పంజాబీ ఫ్యామిలీలో. ఢిల్లీలో పెరిగాను. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాను. నా తల్లిదండ్రులు ఇద్దరు టీచర్లు, మాది చాలా చిన్న ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి సినిమాల మీద పిచ్చితో పెరిగాను. కాలేజీకి ముందు నేను పెద్దగా ఆత్మవిశ్వాసంతో ఉండేదానిని కాదు. బాగా పిరికి దానిని. అక్కడి నుంచే సెల్ఫ్‌మేడ్‌ ఉమెన్‌గా మారాను. చదువుకుంటూనే ట్యూషన్లు చెబుతూ మోడలింగ్‌ చేశాను. మోడలింగ్‌ నుంచి టివి రంగంలోకి అడుగుపెట్టాను. అలానే పంజాబీ చిత్రాలు చేశాను. అక్కడ మంచిపేరు రావడంతో కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తూ ఉన్నాను. 

Advertisement
CJ Advs

‘ఆర్‌ఎక్స్‌100’ చిత్రంలో ఇందు పాత్ర విన్నప్పుడు నెర్వస్‌గా ఫీలయ్యాను. తెస్తే అద్భుతమైన పేరు.. లేకపోతే తీవ్ర విమర్శలు తెచ్చేటు వంటి పాత్ర ఇది. తెలుగులో మొదటి చిత్రమే నెగటివ్‌ పాత్రను చేయడం సాహసంతో కూడిన విషయమేనని నాకు తెలుసు. పైగా సినిమాలో శృంగారపరమైన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఈ పాత్ర చేసినందుకు నేను రియల్లీ గ్రేట్‌ అని ఫీలవుతున్నాను. అంతకు ముందు పంజాబీ చిత్రాలలో సంప్రదాయమైన సిగ్గరి పాత్రలను పోషించిన నేను హఠాత్తుగా ఇలాంటి నెగటివ్‌ ఇందు పాత్రను చేయడం సాహసమేనని చెప్పాలి. 4ఏళ్ల కిందట ఓ తమిళ చిత్రంలో చేశాను.కానీ ఆచిత్రం విడుదల కాలేదు. ఈనెల 15న పంజాబీలో నేను నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 420’ చిత్రం విడుదలైంది. అది పెద్ద హిట్‌ అయింది. అలా వరుసగా నాకు రెండు విజయాలు లభించాయి. చాలా అవకాశాలు వస్తూన్నా కూడా ఒకే తరహా పాత్రలు చేయను. విభిన్నమైన పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలను చేయాలని కోరిక. ‘హీరోయిన్‌’ చిత్రంలో కరీనాకపూర్‌ చేసినటువంటి పాత్రలను చేయాలనేది నా కోరిక. 

ఒకయువతి సినిమా ఫీల్డ్‌లో ఎదుర్కొనే పరిస్థితులకు అద్దం పట్టే చిత్రాలను చేయాలనేది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. నేను నార్త్‌ ఇండియన్‌ని అయినా సౌతిండియన్‌లా ఉంటానని అంటున్నారు. బహుశా మా అమ్మ పోలికలు రావడం వల్ల అలా అనిపిస్తోందేమో! ‘ఆర్‌ఎక్స్‌100’ వంటి బోల్డ్‌ పాత్రలు చేయాలంటే ఆ పాత్రలకు తగ్గట్లు అవి అవసరమని దర్శకుడు నన్ను కన్విన్స్‌ చేయాల్సివుంటుంది. నేను పూర్తిగా ప్రొఫెషనల్‌. నేను అందరు హీరోలకు ముద్దులు ఇవ్వడానికి సినిమా ఫీల్డ్‌కి రాలేదని గుర్తుంచుకోవాలి.. అంటూ చెప్పుకొచ్చింది. 

Payal Rajput About Casting Couch:

RX 100 Heroine Payal Rajput Special Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs