Advertisement
Google Ads BL

అల్లుడే క్లారిటీ ఇచ్చేశాడు.. రావడం లేదని..!!


గత వారం రోజులుగా నాగ చైతన్య - మారుతీ కాంబోలో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు చిత్రం పోస్ట్ పోన్ అవుతుంది... దానికి కారణం ఆ చిత్ర ఆర్ ఆర్ ఇంకా కంప్లీట్ కాకపోవడమనే టాక్ వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో వినబడుతూనే ఉంది. ఇక సినిమాకి రీ రికార్డింగ్ పూర్తి కాకపోవడానికి కారణం కేరళ లో వచ్చిన వరదలు కారణంగా చెబుతున్నారు. మరి గత 10 రోజులుగా కేరళను ముంచెత్తిన భారీ వర్షాలతో కేరళ  మొత్తం అతలా కుతలం అవడం.... కేరళలో నివాసముంటున్న శైలజా రెడ్డి అల్లుడు మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్‌ తో ఆర్ ఆర్ పూర్తి చేయించడానికి వెళ్లిన మారుతీ కేరళ వరదల్లో చిక్కుకుపోవడంతో... శైలజా రెడ్డి అల్లుడు చిత్ర ఆడియో కూడా పోస్ట్ పోన్ అవడం.... ఇక అప్పటినుండి ఈ చిత్రం రేపు ఆగష్టు 31 కి రావడం కల్లే అంటూ న్యూస్ లు వచ్చినా అటు నాగ చైతన్య కానీ.. ఇటు శైలజా రెడ్డి అల్లుడు మేకర్స్ కానీ స్పందించకపోవడంతో ... శైలజా రెడ్డి అల్లుడు అసలు ఆగష్టు 31 న విడుదల ఉంటుందా లేదా అనే దానిమీద టోటల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రేక్షకులు.

Advertisement
CJ Advs

తాజాగా నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమా విడుదలపై సోషల్ మీడియాలో స్పందించాడు. తమ సినిమా ఆగష్టు 31 న రావడం లేదని.. కేరళలో వచ్చిన వరదల వలన అనుకోకుండా శైలజా రెడ్డి అల్లుడు చిత్రానికి రీ రికార్డింగ్ పూర్తి కాకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో.. శైలజా రెడ్డి అల్లుడు సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని.. మరో మంచి డేట్ చూసుకుని శైలజా రెడ్డి అల్లుడు చిత్ర రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటిస్తారని.. తమ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నందుకు సిన్సియర్ గా క్షమాపణలు చెబుతున్నామని చైతు తన సోషల్ మీడియా పేజీ లో ట్వీట్ చేసాడు. సో శైలజా రెడ్డి హీరో నాగ చైతన్య ఆఫీషియల్ గా శైలజా రెడ్డి అల్లుడు పోస్ట్ పోన్ అయిన విషయాన్నీ ప్రకటించాడు.

అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ శైలజా రెడ్డి అనే పవర్ ఫుల్ అత్త పాత్రలో నటిస్తుంది. గోపి సుందర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం అసలైతే ఆగష్టు 31 న విడుదల కావాల్సి ఉంది. కానీ కేరళ వరదల కారణంగా మారుతి, గోపిసుందర్ అక్కడ ఇరుక్కుపోవడంతో... చేసేది లేక శైలజ రెడ్డి అల్లుడు చిత్రాన్ని పోస్ట్ పోన్ చెయ్యడం జరిగింది.

Shailaja Reddy Alludu Postponed:

Naga Chaitanya Clarity on Shailaja Reddy Alludu Postponed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs