Advertisement
Google Ads BL

నయన చిత్రానికి బెస్ట్‌ కాంప్లిమెంట్‌


లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ‘కొలమావు కోకిల’ చిత్రం తమిళనాట విడుదలై సంచలన విజయం దిశగా సాగుతోంది. ఈ మూవీ తమిళనాట విడుదలైన మూడురోజుల్లోనే రూ.10కోట్లు కలెక్షన్లు వసూలు చేయడం గమనార్హం. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నెల్సన్‌ దర్శకుడు. యోగిబాబు, శరణ్య, శరణన్‌, ఆర్‌.ఎస్‌. శివాజీ వంటి నటులు కీలకపాత్రలను పోషించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటకి సంబందించిన వీడియోను విడుదల చేశారు. ఇందులో నయనతారతో పాటు అనిరుధ్ కూడా కనిపిస్తున్నాడు. నయన తనకు ఎదురైన సంఘటనలను ఎదుర్కొనేందుకు తుపాకిని పట్టుకుని సిద్దంగా ఉన్నట్లు చూపించారు. ఇక ఈ చిత్రంలో నయనతార రూ.25కోట్ల విలువైన డ్రగ్స్‌ని ఎలా తరలించింది? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? అనే పాయింట్‌ ఆధారంగా రూపొందింది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా విడుదలైన పాటకు నయనతార ప్రియుడు, ఆల్‌రెడీ ఆమెతో సహజీవనం చేస్తున్నాడని చెబుతున్న దర్శకుడు విఘ్నేష్‌శివన్‌ దర్శకత్వం వహించడం విశేషం. ఈ పాటను కూడా ఆయనే రాశాడు. ఈ పాటను చూసి బాలీవుడ్‌ దిగ్గజం, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌జోహార్‌ స్పందించాడు. సినిమాను చూడాలనే ఆకాంక్షని ఈ చిత్రం పెంచింది. ఈ అద్భుతమైన పాటను చూసిన తర్వాత సౌతిండియన్‌ బ్లాక్‌బస్టర్‌ అయిన ‘కొలమావు కోకిల’ చూడాలని ఉత్సాహపడుతున్నాను. చూడాలన్న ఆశ బాగా పెరుగుతోంది. ఈ చిత్రం యూనిట్‌కి శుభాకాంక్షలు అని తెలిపాడు. దీంతో పాటు ఆ పాట వీడియోను కూడా ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. 

బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ ఓ చిన్న బడ్జెట్‌లో రూపొందిన చిత్రం గురించి పొగడటం నిజంగా ఆశ్చర్యమే. బహుశా ఈ చిత్రాన్ని ఆయన బాలీవుడ్‌లోకి రీమేక్‌ చేస్తాడేమో చూడాలి...! మరోవైపు ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా రీమేక్‌ చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నా కూడా నయనకు తెలుగులో కూడా ఉన్న ఫాలోయింగ్‌ దృష్ట్యా దీనిని ‘కో..కో..కోకిల’ అనే టైటిల్‌తో డబ్‌ చేసి రిలీజ్‌ చేయనున్నారు. 

Karan Johar Praises Nayanthara Kolamavu Kokila:

<span>Kolamavu Kokila Movie Gets Best Complliment From Bollywood Producer</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs