Advertisement
Google Ads BL

టీజర్ బాగుంది.. కానీ అర్ధం కావట్లే..!


సినిమా జయాపజయాలను పక్కనపెడితే విభిన్నమైన చిత్రాలను చేస్తాడనే పేరు నారా రోహిత్‌కి ఉంది. ఈయన సినిమా కథలు, పాత్రలే కాదు.. ఆయన చిత్రం టైటల్స్‌కి కూడా వైవిధ్యంగా ఉంటాయి. ఇక ప్రస్తుతం నారా రోహిత్, శ్రియ, సుధీర్‌బాబు, శ్రీవిష్ణులు కీలకపాత్రను పోషిస్తోన్న చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. సినిమాలనే తగ్గించేసిన శ్రియ ఇందులో నటిస్తుండటం, నారారోహిత్‌తోపాటు శ్రీవిష్ణు, సుధీర్‌బాబులు నటిస్తుండటం, టైటిల్‌పరంగా కూడా ఈ చిత్రం ఆసక్తిని రేపుతోంది. ‘కల్ట్‌ ఈజ్‌ రైజింగ్‌’ అనే ఉప శీర్షికతో వస్తున్న ఈ మూవీకి ఇంద్రసేన దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్‌ ఎంతో ఆకట్టుకుంటోంది. 

Advertisement
CJ Advs

‘నాకు తెలుసు. మీరు వారి రాక కోసం ఎన్నో పూజలు, ప్రార్ధనలు చేస్తున్నారని. నాకు తెలుసు మీరు వాళ్లు ఎలాగైనా వస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని. ఎందుకంటే మీలా ఎదురు చూసే వారిలో నేను కూడా ఒకడినికాబట్టి. ఎదురు చూశాం.. ఎదురు చూశాం. నిమిషాల కాదు.. గంటలు..రోజులు.. నెలలు తరబడవేచి చూశాం. కానీ వారు మాత్రం తిరిగి రాలేదు. కాబట్టి ఇప్పుడు మనం మౌనం వీడాలి..’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ని నారారోహిత్‌ చెబుతుండగా, ఓ వేదికపై నిల్చుని చెబుతున్నఈ మాటలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు వివిధ మాధ్యమాల ద్వారా చూస్తున్నట్లుగా చూపించారు. 

చివరలో యాక్షన్‌ సన్నివేశాలను టీజర్‌లో చూపించారు. పుట్టలుగా పడి ఉన్న తలలను చూస్తే క్రైమ్‌ థ్రిల్లర్‌గా దీనిని తీశారని అనిపిస్తోంది. ఇక దీనికి ‘వీరభోగ వసంతరాయలు’ అనే టైటిల్‌ కూడా ఎవ్వరికీ అర్ధంకాని విధంగా ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. 

Click Here For Teaser

Veera Bhoga Vasantha Rayalu Teaser Released:

Veera Bhoga Vasantha Rayalu Movie Teaser Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs