Advertisement
Google Ads BL

‘న‌ర్త‌న‌శాల‌’ విషయంలో అస్సలు తగ్గరంట..!


 

Advertisement
CJ Advs

కొడుకు మీద ప్రేమతో నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కొడుకు సినిమా ప్రొమోషన్స్ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా స్టార్ హీరోకి ఏమి తీసిపోకుండా ఆ రేంజులో ప్ర‌మోష‌న్ల‌ని చేస్తుంటారు. అప్పుడప్పుడు పెద్దపెద్ద హీరోస్ కి కూడా ఈమాత్రం చేయరేమో అని అనిపిస్తది. ఇప్పుడు అలానే నాగ శౌర్య తండ్రి కూడా చేస్తున్నారు.

నాగ‌శౌర్య తండ్రి శంక‌ర్ ప్ర‌సాద్‌ తన సొంత బ్యానర్ లో ఐరా క్రియేష‌న్స్‌ లో తన కొడుకుతో ‘ఛ‌లో’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టాయి. ఆ సినిమా అంతలా హిట్ అవ్వడానికి ప్రమోషన్స్.. మేజర్ కారణం. కచ్చితంగా శౌర్యకి హిట్ అవసరం అన్న టైములో ఆ బ్యానర్ లో ‘ఛలో’ వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే బ్యానర్ లో ‘న‌ర్త‌న‌శాల‌’ వస్తుంది.

దీనికి కూడా ఈసారి ప్రొమోషన్స్ విషయం ఇది వ‌ర‌కెప్పుడూ లేనంత జోరుగా సాగుతున్నాయి. ఎందుకంటే శౌర్య లేటెస్ట్ మూవీస్ ‘అమ్మ‌మ్మ‌గారి ఇల్లు’, ‘క‌ణం’ ప్ర‌మోష‌న్లు లేక డీలా ప‌డ్డాయి. ‘అమ్మ‌మ్మ‌గారి ఇల్లు’ కి మంచి టాక్ వచ్చిన మూవీకి పబ్లిసిటీ లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిల‌బ‌డ‌లేక‌పోయింది. సో ఆ లోటు.. ‘న‌ర్త‌న శాల‌’కు రాకూడ‌ద‌ని జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. ఇప్పటికే ప్ర‌మోష‌న్ల కోసం ఏకంగా రూ.3.5 కోట్లు ఖ‌ర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరోస్ కి ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తారో అదేవిధంగా ఈ సినిమాకు చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజ‌ర్ల‌కు, పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై హోప్స్ పెరిగిపోయాయి. ‘శైలజ రెడ్డి’ కి పోటీగా ‘న‌ర్త‌న శాల‌’ ఈనెల 30న విడుదల చేయనున్నారు.

High Range Promotions To @Narthanasala:

Naga Shourya Narathanasala Full Speed in Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs