Advertisement
Google Ads BL

సేమ్ చంద్రబాబులానే ఉంటాడంటున్నారు


బాలకృష్ణ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న రెండో చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్టీఆర్ షూటింగ్ ని శరవేగంగా చిత్రీకరిస్తునారు. ఇప్పటికే ఎన్టీఆర్ వైఫ్ కేరెక్టర్ చేస్తున్న విద్యాబాలన్ షూట్ పూర్తవడమే కాదు.. మొన్న ఆగష్టు 15న ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ ఎన్టీఆర్ లుక్ ని విడుదల చేశారు. మరా లుక్ లో అచ్చం సీనియర్ ఎన్టీఆర్ ఎలా ఏ రూపురేఖల్లో ఉన్నాడో.. అచ్చం అదే రూపు రేఖల్లో బాలకృష్ణ కనబడుతున్నాడు. అసలు ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్ర చేస్తున్న బాలకృష్ణ అచ్చం ఎన్టీఆర్ పోలికలతో ఉండి అదరగొట్టేసాడు. ఆ బాలకృష్ణ ఎన్టీఆర్ లుక్ కి విశేషమైన ఆదరణ దక్కింది. మరి దర్శకుడు క్రిష్ నటీనటుల మేకప్ దగ్గరనుండి.. అన్ని విషయాల్లో ఎంతగా కేర్ తీసుకుంటున్నాడో ఆ లుక్ చూస్తే అర్ధమయ్యింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా చంద్రబాబు పాత్రధారి రానా కూడా అచ్చం చంద్రబాబు రూపురేఖల్లో ఉండబోతున్నాడు. ఇప్పటికే నేనేరాజు నేనే మంత్రి సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా ఇరగదీసాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో ఎంతో కీలకమైన ఎన్టీఆర్ పెద్దల్లుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుగా రానా కూడా అదరగొడతాడట. అలాగే రానా లుక్ కూడా అచ్చం చంద్రబాబును పోలి ఉంటుందని .. అందులో ఎలాంటి సందేహమే లేదని చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ ఎన్టీఆర్ లుక్ లో ఎంతగా మెప్పించాడో.. రానా కూడా చంద్రబాబు పాత్రలో ఒదిగిపోతాడట. వాళ్ళ ఆకారాలు అనుకున్న పాత్రలకు దగ్గరగా ఉండేలా.. బాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్టులు శ్రమిస్తున్నారట. 

ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న నటీనటుల మేకప్ కోసం బాలీవుడ్ నుండి మేక‌ప్ ఆర్టిస్టులును రప్పించారు. ఇక బాలీవుడ్ మేక‌ప్ ఆర్టిస్టులు అంతగా శ్రమించబట్టే అన్ని పాత్రలు గెటప్స్ చాలా సహజంగా వస్తున్నాయట. ఇక శ్రీదేవి పాత్రకి రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక కాగా.. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నరేష్, మోహన్ బాబు వంటి వారు అనేక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బాలకృష్ణ కీలక నిర్మాతగా... సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా నిర్మిస్తున్నారు. ఇక ఈ ఎన్టీఆర్ బయోపిక్ వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Waiting For Rana Look in NTR Biopic:

<h3 class="text-center"><span style="font-weight: normal;">Rana watching Chandrababu Naidu videos</span></h3>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs