Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండ సామాన్యుడు కాదు బాబోయ్..


విజయ్ దేవరకొండ పేరు ఇప్పుడు టాలీవుడ్ ఒక రేంజ్ లో అంటే స్టార్ హీరోల రేంజ్ లో మార్మోగిపోతోంది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ రేంజ్ తో పాటుగా క్రేజ్ తో పాటుగా మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. ఇక నిన్నటికి నిన్న గీత గోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ పేరు మరింతగా పెరిగింది. ఒక పక్క పారితోషకం పెరగడమే కాదు.. విజయ్ క్రేజ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇపుడు పక్క రాష్ట్రం తమిళనాట కూడా మొదలవ్వబోతుంది. నోటా సినిమాతో డైరెక్ట్ గా తమిళనాట ఎంట్రీయే వివాదానికి ముహుర్తం అనేలా విజయ్ దేవరకొండ సిద్దమవుతున్నాడు. మెహ్రీన్ కౌర్ తో కలిసి నోటా సినిమాతో విజయ్ తమిళంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే తనకు పెరిగిన మార్కెట్ ని క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇప్పుడు తన బిజినెస్ ని విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నాడు. తనకున్న యాటిట్యూడ్ తో ఇప్పటికే యువతను ఆకర్షించేలా రౌడీ అనే వెబ్ సైట్ తో పాటుగా రౌడీ బ్రాండ్ దుస్తులను కూడా బిజినెస్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ వస్త్రాల బిజినెస్ ఒక రేంజ్ లో పెరిగింది. విజయ్ క్రేజ్ తో పాటుగా విజయ్ బిజినెస్ కూడా అదరగొట్టే రేంజ్లో పెరిగింది. మరి విజయ్ దేవరకొండ ఫారిన్ నుంచి దుస్తుల్ని దిగుమ‌తి చేసి..... పక్కన బెంగ‌ళూరులో డిజైనింగ్ చేసి మరీ ఇక్కడ దింపుతున్నాడు‌. ఇక ప్ర‌తీ బుధ‌వారం ఒక కొత్త మోడ‌ల్‌ని మార్కెట్ లోకి ప్ర‌వేశ పెడుతుంటే.. వ‌చ్చిన స్టాకంతా కేవలం 40 నిమిషాల్లోనే ఆ స్టాక్ అంతా అమ్ముడు పోవడం చూస్తుంటే.. విజయ్ వ్యాపారం ఏ రేంజ్లో ఉందో అర్ధమవుతుంది.

మరీ ఈ రేంజ్ లో వ్యాపారం జరుగుతుంటే.. దాన్ని మరింతగా పెంచాలని విజయ్ ఇప్పుడు నిర్ణయించుకోవడంలో తప్పు లేదుగా. ఇక విజయ్ తనకు కొత్త మోడల్స్ ని ట్రై చెయ్యడమంటే చాలా ఇష్టమని... ఫారెన్ నుంచి కూడా తనకి కావాల్సిన కాస్ట్యూమ్స్‌ని దిగుమ‌తి చేయించుకుంటుంటా.. అందుకే నా అభిరుచి త‌గ్గ‌ట్టు రౌడీ పేరుతో బ్రాండింగ్ చేస్తున్నా... ఆ బ్రాండ్స్ కి స్పంద‌న చాలా బాగుంది. నా సినిమాల ఆడియో ఫంక్ష‌న్ల‌కు నా అభిమానులు చాలామంది నేను వేసుకునే డ్రెస్సింగ్ స్టయిల్ నే అనుకరిస్తున్నారు. ఆ విషయంలో నేను హ్యాపీ అని చెబుతున్నాడు ఈ గోవిందుడు.  మరి ఒక పక్క సినిమాల హిట్. మరోపక్క ఇలా వస్త్రాల వ్యాపారం చూస్తుంటే విజయ్ దేవరకొండ ఎంత తెలివైనోడో అర్ధమవుతుంది. సినిమాల క్రేజ్ తో వ్యాపారం డెవెలెప్ చేసేస్తున్నాడు.

Vijay Deverakonda Busy with Movies and Business:

Vijay Deverakonda Business Sensation in Market
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs