Advertisement
Google Ads BL

బన్నీతో అలాంటి చిత్రమెలా తీయాలనుకున్నాడో..


సౌత్ ఇండియాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా కేరళలో బన్నీకి చెప్పలేని ఫాన్స్ ఉన్నారు. కోలీవుడ్ లో కూడా అంతే. అందుకే అతనితో సినిమా చేయడానికి కోలీవుడ్ నుండి చాలామంది డైరెక్టర్స్ ట్రై చేస్తున్నారు. గత కొన్ని నెలలు కిందట స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ ఒక సినిమా బన్నీ చేయాల్సివుంది కానీ అది కొన్ని అనివార్య కారణాలు వల్ల సెట్స్ మీదకు వెళ్ళలేదు.

Advertisement
CJ Advs

అలానే మరో కోలీవుడ్ డైరెక్టర్ బన్నీతో సినిమా చేయాలనీ ట్రై చేశాడు. ‘నా పేరు శివ’, ‘పల్నాడు’, ‘జయసూర్య’ సినిమాలు తీసిన సుశీంద్రన్ బన్నీతో ఓ సినిమా అనుకున్నాడు. కానీ బన్నీకి స్టోరీ నచ్చకపోడంతో రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆ కథను ఓ కొత్త హీరోతో చేశాడు సుశీంద్రన్. రీసెంట్ గా దానికి ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి విడుదల అయింది. ఆ పోస్టర్ చూస్తే ఈ తరం యువతపై చదువుల్ని ఎలా రుద్దుతున్నారో.. ఆ వలలో వాళ్లు ఎలా చిక్కుకుపోయి విలవిలలాడుతున్నారో చెప్పే స్టోరీలా ఉంది.

అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే...బన్నీ లాంటి స్టార్ హీరోతో ఇటువంటి మూవీ ఎలా చేయాలనుకున్నాడనే విషయం అర్ధం కావట్లేదు. కానీ కోలీవుడ్ మీడియా మాత్రం ఈ కథ బన్నీకి అనుకుంది కాదని ఇది వేరే అని చెబుతుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి. ఈ డైరెక్టర్ సందీప్ కిషన్ తో రీసెంట్ గా తీసిన ‘కేరాఫ్ సూర్య’ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఒకవేళ బన్నీ చెప్పిన కథ ఇదే అయితే బన్నీసేఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే మాస్ హీరో బన్నీతో ఇటువంటి కథలు సూట్ అవ్వవు కాబట్టి.

Suseenthiran Plans Message Film with Allu Arjun:

Allu Arjun turns down Tamil director’s film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs