Advertisement
Google Ads BL

మేం ఎందుకు లీక్ చేస్తాం: బన్ని వాసు


రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘గీత గోవిందం’ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈసినిమాకి ముందు ఈమూవీ పైరసీ ఎంత వివాదం అయిందో అందరికి తెలిసిన విషయమే. సినిమా మొత్తం లీక్ అయిన సంగతి కూడా తెలిసిందే. దీనిపై అప్పుడు అల్లు అరవింద్ తో పాటు హీరో విజయ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయినా బన్నీ వాసు తన ఆవేదన వ్యక్తం చేశారు

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమా ప్రమోషన్ కోసమే కావాలనే సినిమాలోని కొన్ని సన్నివేశాలు లీక్ చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై చర్చ కూడా జరుగుతుంది. అయితే దీనిపై రీసెంట్ గా ప్రొడ్యూసర్ బన్నీ వాసు స్పందించాడు. అసలు సినిమా ప్రమోషన్ కోసం పూర్తి సినిమాను ఎవరైనా లీక్ చేస్తారా? అని ప్రశ్నించాడు.

అసలు ఎవరైనా పూర్తి సినిమాను లీక్ చేస్తారా? చేస్తే ఒకటి రెండు సీన్స్ లీక్ చేశారు అనుకోవచ్చు. అయినా ఈ కేసును హై రేంజ్ పోలీస్ ఆఫీసర్స్ హ్యాండిల్ చేశారు. ఒకవేళ మేము అలా చేసి ఉంటే ఆయన ఈ కేసును టేకప్ చేస్తారా? ఈ ఆరోపణలు అన్ని  అబద్దం. అయినా లీకేజీ వల్ల మాకు లాభమేమి జరగలేదు. కొన్ని  కాలేజీలు, స్కూళ్ల ఆడిటోరియాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇది చాలా దారుణం. దీనివల్ల కలెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. మేము ఎంతో కష్టపడి..ఇష్టపడి ఇన్ని కోట్లు పెట్టి సినిమాను తీసినప్పుడు ఇలా జరిగితే ఎవరికైనా బాధగా ఉంటుంది. ఈ కష్టం ఇంకెవరికి రాకూడదని బన్నీ వాసు తన ఆవేదన వ్యక్తం చేశారు.

Bunny Vas About Geetha Govindam Leaks:

Bunny Vas Clarity on Geetha Govindam Movie Leaks
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs