Advertisement
Google Ads BL

వాజ్ పేయ్‌ని వదలని గోవిందుడు


ఇండియా మాజీ ప్రధాని బిజెపి మాజీ అధ్యక్షుడు అటల్ బిహారి వాజ్ పేయి గత గురువారం సాయంత్రం 5.05 నిమిషాల ప్రాంతంలో కన్ను మూశారు. అయితే వాజ్ పేయికి నివాళులర్పిస్తూ దాదాపుగా 15 రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యా సంస్థలకు, ఆఫీసులకు నిన్న శుక్రవారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం వారం  రోజులు సంతాప దినాలు ప్రకటిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరోజు సంతాప దినంతో పాటుగా స్కూళ్ళకి, ఆఫీస్‌లకు సెలవులిచ్చారు. అయితే ఇప్పుడు వాజ్ పేయ్ సంతాప దినం రోజున ఒక హీరో సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్ లో దూసుకుపోయాయి. విజయ్ దేవరకొండ - రష్మిక జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమా గత బుధవారం అంటే వీక్ మిడిల్ లో ఆగష్టు 15 న విడుదలైంది.

Advertisement
CJ Advs

మరి గీత గోవిందం సినిమాకి ఎంత సూపర్ హిట్ టాక్ వచ్చినా.. వర్కింగ్ డేస్ లో ఆ సినిమా కలెక్షన్స్ కాస్త తగ్గే అవకాశం లేకపోలేదు. మరి ఆగష్టు 15 బుధవారం రోజున దాదాపుగా 9 కోట్ల మేర కలెక్షన్స్ కొల్లగొట్టిన గీత గోవిందం సినిమా రెండో రోజు గురువారం కూడా జోరు సాగించింది. అయితే అనుకోకుండా గీత గోవిందం సినిమాకి అటల్ బిహారి వాజ్ పేయ్ సంతాప దినం అయిన శుక్రవారం బాగా కలిసొచ్చింది. అనుకోకుండా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించడం.. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లోనూ సెలవు రావడంతో గీత గోవిందం సినిమా కలెక్షన్  డ్రాప్ అవ్వలేదని తెలుస్తుంది. ఇప్పటికే అంటే రెండో రోజుకే గీతకి పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేసింది.

రెండో రోజు నుండి లాభాల బాట పట్టిన గీత గోవిందం నిర్మాత బన్నివాస్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. కేవలం సినిమా కలెక్షన్స్ మాత్రమే కాదు.. శాటిలైట్స్ హక్కులకు కూడా గీత గోవిందం మంచి రేటు తెచ్చుకుంది. ఇక వీక్ డేస్ లో విడుదలైన బుధవారం, శుక్రవారం సెలవల్తో.. లాంగ్ వీకెండ్ గా కలెక్షన్స్ జోరు మరింతగా పెరుగుతూనే ఉంది. ఇక ఈ వీకెండ్ లో గీత గోవిందం జోరు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... ఓవర్సీస్ లోను దంచేస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వచ్చే శుక్రవారం వరకు గీత గోవిందం సినిమాకి వీర లెవల్లో కలెక్షన్స్ రావడం ఖాయం.

Geetha Govindam got one More Lucky Day:

Atal Bihari Vajpayee Helps Geetha Govindam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs