Advertisement
Google Ads BL

అందరూ యూనానిమస్‌గా హిట్టంటున్నారు


విజయ్‌ దేవరకొండ విజయ పరంపర వరుసగా దూసుకెళ్తోంది. ఆయన నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి' వంటి చిత్రాలే కాదు... పూర్తిస్థాయి హీరోగా ఆయన నటించిన 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి'లు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు అదే కోవలోకి 'గీతగోవిందం' కూడా చేరింది. దాంతో ఈయన హ్యాట్రిక్‌ స్టార్‌గా మారాడు. గీతాఆర్ట్స్‌2 బేనర్‌లో బన్నీవాసు నిర్మాతగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రం విజయ్‌ దేవరకొండ స్థాయిని మరో మెట్టు ఎక్కించడమే కాదు... రష్మిక మందన్నను కూడా హ్యాట్రిక్‌ హీరోయిన్‌ని చేసింది. 

Advertisement
CJ Advs

ఇక విజయ్‌ నటించిన 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం' వంటి మూడు చిత్రాలు వివిధ జోన్లు, విభిన్న తరహా చిత్రాలు కావడం విశేషం. దీనిని బట్టే విజయ్‌ చిత్రాలు జడ్జిమెంట్‌ పక్కాగా ఉంటోందని, తన మీద ఫలానా ముద్ర పడకుండా ఆయన ముందుకు వెళ్తున్నాడనే చెప్పాలి. నేచురల్‌ స్టార్‌ నానికి, నిఖిల్‌ వంటి వారికి ఈయన బాగా పోటీని ఇస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రం చూసిన ప్రేక్షకులే కాదు.. సెలబ్రిటీలు కూడా చిత్రం ఎంతో బాగుందని కితాబునిస్తున్నారు. మొన్ననే రాజమౌళి చిత్రం చాలా బాగుంది. విజయ్‌ ఏం చేస్తున్నాడో ఆయనకి బాగా తెలుసు అంటూ కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. ఇక తాజాగా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు కూడా ఈ చిత్రంపై స్పందించాడు. 'గీతగోవిందం' చూశాను. బాగా ఎంజాయ్‌ చేశాను. విజయ్‌ దేవరకొండ, రష్మికల నటన ఎంతో బాగుంది. వెన్నెల కిషోర్‌ కామెడీ కూడా ఆకట్టుకునేలా ఉంది. టోటల్‌ చిత్రం టీంకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పాడు. 

ఇక మహేష్‌తో పాటు దర్శకుడు అనిల్‌రావిపూడి, బాహుబలి నిర్మాత శోభుయార్లగడ్డలు కూడా ఈ చిత్రం చాలా బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విజయ్‌, రష్మికల కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం పరశురాంని కూడా స్టార్‌ని చేస్తుందని చెప్పాలి. దీంతో అల్లుఅర్జున్‌తో పరశురాం సినిమా ఖరారు కావడం ఖాయమనేనని చెప్పాలి. 

Celebrities Praises Geetha Govindham:

Geetha Govindam got Unanimous Hit Talk
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs