Advertisement
Google Ads BL

నమ్రతా శిరోద్కర్ సస్పెన్స్‌లో పెట్టింది


ఒకప్పుడు నటీనటులు, హీరోలు వృత్తిలోనే ఏడాది మొత్తం పని చేస్తూ ఉండేవారు. కృష్ణ వంటి హీరోలు ఒకేరోజున మూడు నాలుగు షూటింగ్‌లలో పాల్గొంటూ, విరామం లేకుండా రాత్రింబగళ్లు షూటింగ్‌లతో బిజీగా ఉండేవారు. దాని వల్లనే వారు 300కిపైగా చిత్రాలు, ఏడాదికి 15 నుంచి 20 రిలీజ్‌లతో సాగారు. కానీ నాడు వారు వ్యక్తిగత విషయాలను మాత్రం పట్టించుకునే వారు కాదు. వారికి ఆ తీరిక కూడా ఉండేది కాదు. 

Advertisement
CJ Advs

కానీ నేటితరం యంగ్‌స్టార్స్‌ వృత్తికి ఎంత సమయం కేటాయిస్తున్నారో విరామం దొరికితే కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంకా వీలుంటే విదేశాలలో షూటింగ్‌ ఉంటే తమ కుటుంబాలను కూడా అక్కడికి తీసుకెళ్లి, స్వామికార్యం.. స్వకార్యం కూడా పూర్తి చేస్తున్నారు. బహుశా తన తండ్రి కృష్ణ బిజీ వల్ల తమతో ఎక్కువ సమయం గడపలేకపోయాడనే ఉద్దేశ్యంతోనే మహేష్‌ తన భార్యాపిల్లలకు ఆలోటు రాకుండా చేయడం కోసమే వారికి బాగా సమయం కేటాయిస్తున్నాడా? అనిపిస్తుంది. ఇక మహేష్‌బాబు ప్రస్తుతం దిల్‌రాజు, అశ్వనీదత్‌ల నిర్మాణ భాగస్వామ్యంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకమైన తన 25వ చిత్రంగా 'మహర్షి' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ వేగంగా జరుగుతోంది. 

ఇక మహేష్‌ తన పిల్లలను ఎంత గారాబం చేస్తాడో పలుసార్లు ఆయన శ్రీమతి నమ్రతా సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూనే ఉంటుంది. తాజాగా ఆమె తాను కాదన్నా కూడా వారి కోరికలను తీర్చుకునేందుకు గౌతమ్‌కృష్ణ, సితారలు తమ తండ్రి వద్ద పంచాయతీ పెట్టారని తెలిపింది. ఈ సందర్భంగా మహేష్‌తోపాటు గౌతమ్‌కృష్ణ, సితారలు కలిసి ఉన్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. మరి ఇంతకీ నమ్రతా వద్దంది ఏమిటి? పిల్లలు తమ తండ్రి మహేష్‌తో పెట్టిన పంచాయతీ దేని కోసం? అనేవి మాత్రం నమ్రతా సస్పెన్స్‌లో ఉంచింది.

Sitara, Gautam Complains To Mahesh Babu:

Namrata Said No, Mahesh Compromises    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs