Advertisement
Google Ads BL

అంతా ఓపెన్‌ అయినప్పుడు ఈ షరతులు ఎందుకు?


గతంలో ఇండియన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌కోహ్లి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్కశర్మల వివాహం జరగనుందని, వారు ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోనున్నారని ముందుగానే మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ వారిద్దరు దానిని ఖండించారు. వారి వివాహం ముందు రోజు కూడా అనుష్కశర్మ పీఆర్వో అదంతా కల్పితం అని కొట్టిపారేశాడు. ఇక హీరోయిన్‌ శ్రియా శరణ్‌ విషయానికి వస్తే ఆమె తన వివాహం కోసం షాపింగ్‌ చేస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆమె మాత్రం తన స్నేహితురాలి వివాహం కోసమే తాను షాపింగ్‌ చేస్తున్నానని తెలిపింది. కానీ మీడియా చెప్పినట్లుగానే ఆమె రాజస్థాన్‌లో వివాహం చేసుకుంది. 

Advertisement
CJ Advs

ఇక టాలీవుడ్‌ కపుల్స్‌ అయిన నాగచైతన్య, సమంతల వివాహం రెండురోజుల పాటు గోవాలో జరుగుతుందని కూడా మీడియా ముందే చెప్పింది. అందరికీ తెలిసిన విషయమే అయినా సమంత, నాగచైతన్యలు ఈ వివాహవేడుక ఫొటోలను తప్పితే, వీడియోలు తీయవద్దని అతిధులకు షరతు విధించారు. ఆ తర్వాత తమ పెళ్లి వీడియోను సమంతనే సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. 

ఇక తాజాగా బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ అయిన రణవీర్‌సింగ్‌, దీపికా పడుకోనేల వివాహం కూడా నవంబర్‌ 20న జరగనుందని మీడియా గట్టిగా చెబుతోంది. కానీ వీరు మాత్రం అది నిజం కాదు అంటున్నారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం వారి వివాహం నవంబర్‌ 20న ఇటలీలోని లేక్‌కోమ్‌ రిసార్ట్స్‌లో వీరు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోనున్నారు. కేవలం 30 నుంచి 40 మంది అతిధులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కానున్నారు. కానీ వీరు మాత్రం అతిధులకు తమ పెళ్లికి వచ్చేటప్పుడు సెల్‌ఫోన్స్‌, మొబైల్స్‌ తీసుకుని రావద్దనే షరతుని విధించారట. అంతా ఓపెన్‌ అయిన తర్వాత ఇంకా ఈ సీక్రెట్స్‌ ఎందుకబ్బా? అనే సెటైర్లు వాగా వినిపిస్తున్నాయి. 

Ranveer and Deepika’s Condition For Their Wedding Guests:

Ranveer Singh And Deepika Padukone Ask Guests To Not Carry Mobile Phones At Their Wedding
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs