Advertisement
Google Ads BL

‘బుర్రకథ’ చెప్పేందుకు వస్తున్నారు..


ఆది సాయికుమార్, డైమండ్ రత్నబాబుల ‘బుర్రకథ’ సినిమా ప్రారంభోత్సవం..

Advertisement
CJ Advs

రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు తొలిసారి డైరెక్టర్ గా రాబోతున్నారు. శుక్రవారం లాంచ్ అయిన ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్నారు. ‘బుర్రకథ’ అనేది సినిమా టైటిల్. టాలీవుడ్ లోని ప్రముఖ రచయితలు ఈ సినిమా ఓపెనింగ్ కి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమాలోని హీరో ఫస్ట్ సీన్‌కి క్లాప్‌ని అందించగా, లిరిసిస్ట్, రచయిత అయిన శివ శక్తి దత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ.. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా తోటి రచయితలు, పెద్దలు ఈ సినిమా ఓపెనింగ్‌కి వచ్చి డైరెక్టర్ గా తొలి చిత్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించినందుకు.  అలాగే ఈ సందర్భంగా నా ప్రొడ్యూసర్స్‌కి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు టాప్ టెక్నిషియన్స్ ని ఇచ్చి సపోర్ట్ చేసినందుకు. కథ చెప్పిన వెంటనే సినిమాని ఓకే చేసి నాపై నమ్మకం ఉంచిన హీరో ఆది సాయి కుమార్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా స్క్రీన్‌ప్లే రైటర్స్ ని పరిచయం చేస్తున్నాను. వారికి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

రచయిత శివ శక్తి దత్త మాట్లాడుతూ, ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది.. ఈ సినిమాలో ఒక పాట రాస్తున్నాను.. ఈ సినిమా సక్సెస్ అయ్యి చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను.. అన్నారు..

హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. ఈ సంవత్సరంలో ఇది నా మూడో సినిమా.. ఈ మూడు సినిమాలు నాకు ఎంతో ఎక్జయిటింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా చేయడం ఎంతో థ్రిల్‌గా ఉంది. రత్నబాబుగారు మంచి ఫ్రెష్ లైన్‌తో వచ్చారు. ఇందులో నా పాత్ర డిఫరెంట్‌గా చాలా బాగుంది. టాప్ టెక్నిషియన్స్ తో ఈ సినిమా చేయడం ఎంతో హ్యాపీగా ఉంది.  అన్నారు..

నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ.. మా బ్యానర్ లో ఇది రెండో సినిమా.. బుర్రకథ తప్పకుండా ఓ మంచి సినిమా అవుతుంది. డెఫినెట్లీ ఈ సినిమా ద్వారా మా బ్యానర్ కి మంచి పేరొస్తుంది. రేపటినుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇంకో వారంలో సినిమాకి సంబంధించిన హీరోయిన్స్, ఇతర నటీనటులు కన్ఫర్మ్ అవుతారు.. అన్నారు. 

Aadi Saikumar and ‘Diamond’ Ratna Babu’s ‘Burra Katha’ Launched:

Aadi Saikumar New Film Title is Burra Katha
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs