Advertisement
Google Ads BL

ఎన్టీఆరా.. లేక ఎన్టీఆర్‌ని మించేశాడా..!


బాలీవుడ్‌లో వచ్చిన ‘పద్మావత్‌’ చిత్రం అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో దీపికాపడుకోనే, రణవీర్‌సింగ్‌, షాహిద్‌ కపూర్‌లు నటించినా అందరికంటే ఎక్కువ పేరు ప్రతిష్టలు రణవీర్‌సింగ్‌కే లభించాయి. అలాంటి క్రూరమైన పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఆ పాత్రకి ఆయన జీవం పోశాడు. ఇక విషయానికి వస్తే వరుస పరాజయాలతో సతమతమవుతున్న యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌కి పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్‌’ మంచి విజయాన్ని అందించడమే కాదు.. ఆయన కెరీర్‌ని మరలా ట్రాక్‌లో పెట్టింది. ఇక ఇందులో ఎన్టీఆర్‌ నటవిశ్వరూపం చూపించాడు. కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉండే పోలీస్‌ అధికారి పాత్రలో ఎన్టీఆర్‌ నటన అమోఘం. ఈ చిత్రం చూసిన విమర్శకులు ఎన్టీఆర్‌, పూరీలపై ప్రశంసల వర్షం కురిపించారు. దాసరి వంటి గొప్ప దర్శకుడే.. నా తర్వాత పూరీనే సరైన దర్శకుడు అని కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. ఇక కోర్టు సీన్‌లో ఎన్టీఆర్‌ నటన అమోఘం. మరోవైపు పోసాని కృష్ణమురళి పాత్ర కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అయింది. 

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో రీమేక్‌ అవుతోంది. తమిళంలో విశాల్‌ నటిస్తుండగా, బాలీవుడ్‌లో రణవీర్‌సింగ్‌.. ఎన్టీఆర్‌ పాత్రను పోషిస్తున్నాడు. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు ‘సింబ’. డిసెంబర్‌ 28న ఈ మూవీ విడుదల కానుంది. స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన ఓవీడియోను విడుదల చేశారు. ఇందులో ఓ చక్కటి సందేశం ఇచ్చారు. నువ్వు మహిళలపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా పోరాడకపోతే, రేపటి బాధితురాలు నీ కుటుంబ సభ్యురాలే అవుతుంది. మహిళపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా పోరాడుతామని, ఈ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ప్రమాణం చేయండి. మహిళలను వేధించే వారికి శిక్ష తప్పనిసరి అని ఈ వీడియోలో సారాంశం. రౌడీలను రణవీర్‌ చితకబాదడం, పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా పవర్‌ఫుల్‌గా మెప్పించాడు. 

Click Here for Teaser

Simmba Independence Day Treat :

Simmba teaser: Ranveer’s raw avatar is perfect treat for girls this Independence Day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs