Advertisement
Google Ads BL

గోవిందుడు 15 రోజులు కుమ్ముడే కుమ్ముడు


వీక్ మిడిల్ బుధవారం రోజున ఆగష్టు 15న హాలిడే రోజున తన సినిమా గీత గోవిందం మీదున్న నమ్మకంతో.. విజయ్ దేవరకొండ ఈ సినిమాని విడుదల చేసాడు. మరి విజయ్ దేవరకొండ గీత గోవిందం మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. సినిమా మొదటి షోకే హిట్ టాక్ వచ్చేసింది. గీత గోవిందం సినిమా ఓవరాల్‌గా సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. వీక్ మిడిల్‌లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండకి ఈ శుక్రవారం పోటీనే లేదు. గత శుక్రవారం విడుదలైన శ్రీనివాస కళ్యాణం, విశ్వరూపం 2 సినిమాలు దుకాణం సర్దేయడం.. విజయ్ దేవరకొండ గీత గోవిందానికి బాగా కలిసొచ్చింది. ఇక సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న గీత గోవిందానికి వచ్చే శుక్రవారం ఏ సినిమా పోటీకి లేకపోవడం.. వచ్చే శుక్రవారం వరకు అంటే మరో పదిరోజుల పాటు కలెక్షన్స్ కుమ్మెయ్యడం పక్కా. దీంతో సినిమాని నిర్మించిన బన్నీ వ్యాస్ కి టైమ్ బాగా కలిసొచ్చింది.

Advertisement
CJ Advs

జీఏ2 పిక్చర్స్ లో పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటుగా యూత్ ని బాగా ఆకట్టుకుంది. ఇక సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కడం.. విజయ్ దేవరకొండ కామెడీతో కూడిన డైలాగ్స్ తో సినిమాలో పిచ్చెక్కించడం, హీరోయిన్ రష్మిక నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్. అలాగే విజయ దేవరకొండ - రష్మిక ల మధ్యన రొమాంటిక్ సన్నివేశాలు, విజయ్ స్టైలిష్ లుక్స్, రష్మిక కూల్ లుక్స్ అన్ని సినిమాలో ప్రధాన ఆకర్షణగా వున్నాయి. కాకపోతే సెకండ్ హాఫ్ కాస్త స్లో అవడం, ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలు తప్ప సినిమాలో మైనస్ పాయింట్స్ పెద్దగా కనబడడం లేదు. ఇక ఈ వీకెండ్ మాత్రమే కాదు... వచ్చే సోమారం నుండి శుక్రవారం వరకు గీత గోవిందం థియేటర్స్ ఫుల్ అవడం ఖాయంగా కనబడుతున్నాయి. అలాగే గీత గోవిందం ఓవర్సీస్ లోను కుమ్మేస్తుంది. ఇక ఆగష్టు 24 శుక్రవారం రాబోయే సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించే సినిమాలేమి కనబడటం లేదు. అంటే అదనంగా మరో వారం రోజులు గీత గోవిందానికి కలిసొచ్చే అంశంలా కనబడుతుంది.

ఆగష్టు 24 న రాబోయే సినిమాల్లో ఆటగాళ్లు, నీవెవరో, ఈమాయ పేరేమిటో, అంతకు మించి సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి. అందులో నారా రోహిత్, జగపతి బాబుల ఆటగాళ్లు సినిమాకి కాస్త క్రేజ్ ఉంది. అలాగే ఆది పినిశెట్టి, తాప్సి, రితిక సింగ్ లు నటించిన నీవెవరో సినిమా కూడా కాస్త అంచనాలున్నాయి. ఇక రష్మీ గౌతమ్ అంతకు మించి, ఈమాయ పేరేమిటో సినిమాల మీద అంతగా క్రేజ్ అయితే లేదు. మరి ఆటగాళ్లు, నీవెవరో సినిమాలకు కాస్త టాక్ తేడా వచ్చిందా గీత గోవిందం సినిమా మళ్ళీ మరోవారం కలెక్షన్స్ కుమ్మేయడం ఖాయం. అలా మరో 15 రోజుల పాటు గీత, గోవిందాలు బాక్సాఫీస్‌ని కుమ్మేయడం ఖాయం.

Geetha Govindham Sensation at Box Office:

No Movie Competition to Vijay deverakonda Geetha Govindham 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs