Advertisement
Google Ads BL

ఎక్స్‌పోజ్ చేయకుండానే హిట్టు కొట్టింది


హీరోయిన్స్ ఏ భాషలో అయినా అందాలు ఆరబోస్తూ... గ్లామర్ షో చేస్తేనే సినిమాల్లో పది కాలాల పాటు హీరోయిన్స్ గా కొనసాగుతారనేది నేటి మాట. గతంలో చీరకట్టుతోనే అందరిని ఆకర్షించిన హీరోయిన్స్ రాను రాను.. గ్లామర్ తో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. సినిమాలో హీరో ఎన్ని ఫైట్స్ చేస్తాడో.. హీరోయిన్స్ ఎన్ని గ్లామర్ డ్రెస్సులు వేస్తుందో అని ప్రేక్షకుడు ఎదురు చూసే కాలంలో మనం ఉన్నాం. ఎక్కడో ఒకటి అరా హీరోయిన్స్ మాత్రమే గ్లామర్ షో చెయ్యడానికి వెనుకాడినా.. వారు సినిమాల్లో తన నటన.. అభినయంతో ఆకట్టుకుని అందరిని మెస్మరైజ్ చేస్తున్నారు. మొదట్లో గ్లామర్ షో కి నో చెప్పినా క్రమేణా వారు అలా గ్లామర్ షోకి అలవాటు పడిపోతున్నారు.

Advertisement
CJ Advs

తాజాగా కన్నడ భామ రష్మిక మందన్న కన్నడలో కిరాక్ పార్టీతో హీరోయిన్ గా హిట్ కొట్టి తెలుగులోకి ఛలో సినిమాతో సింపుల్ ఎంట్రీ ఇచ్చింది. ఛలో సినిమాలో ట్రెడిషనల్ గా మందు కొట్టే అమ్మాయిగా.. అల్లరి పిల్లగా.. ప్రేమికురాలిగా నటించి మెప్పించిన రష్మిక.. విజయ్ దేవరకొండతో కలిసి గీతగోవిందం సినిమాలో నటించింది. ఈ సినిమాలో నటించడానికి బోలెడంతమంది హీరోయిన్స్ రిజెక్ట్ చేసిన రష్మిక మాత్రం ఈ సినిమా కథకి ఓకే చెప్పింది. మరి రష్మిక ఈ సినిమా అవకాశాన్ని అందుకుని మంచి పని చేసిందనే అభిప్రాయం ప్రేక్షకుల నుండి వినబడుతుంది. ఈ గీత గోవిందం సినిమాలో ఫిమేల్ ఈగో చూపించింది. గమ్మత్తైన అందం. అపురూప సౌందర్యం లాంటి మాటలు చెబితే అతిశయోక్తిగా అనిపిస్తుంది కానీ ఒకసారి చూస్తే కళ్ళు పక్కకు తిప్పుకోనివ్వకుండా చేయటంలో తన దగ్గర ఏదో మేజిక్ ఉంది. ఛలో తో అది ప్రూవ్ అయినా.. గీత గోవిందం సినిమాలో కూడా అదే మాయ చేసింది. కాస్త పొగరు వగరు ఉన్న పాత్రలో గీతగా పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది.

ఈ సినిమాలో విజయ్ కు ధీటుగా రష్మిక నటన ఉంది. ఎమోషనల్ సీన్లలో రష్మిక బాగా చేసింది. ఫస్ట్ హాఫ్ లో కోపం తప్ప ఇంకే హావభావం లేకుండా అదరగొట్టింది. అందం ఉంటే చాలు గ్లామర్ షో చెయ్యకపోయినా హిట్ కొట్టొచ్చు అన్నట్టుగా రష్మిక అందం ఉంది. మరి చాలా సింపుల్ లుక్స్ తో, చాలా సింపుల్ గ్లామర్ తో రష్మిక హీరోయిన్ గా వరసగా టాలీవుడ్ లో రెండు హిట్స్ కొట్టింది ఈ భామ. మరి ఈ హిట్స్ తో రష్మిక కెరీర్ టాలీవుడ్ లో ఏ రేంజ్ కి వెళ్లబోతుందో... ఈ హిట్స్ చూశాక అప్పుడే పెళ్లి చేసుకుంటుందో లేదో అనే అనుమానం మాత్రం ప్రేక్షకుల్లో తలెత్తింది.

Rashmika Mandanna Got Hit with Geetha Govindham:

Rashmika Mandanna Got Sensational Hit without Exposing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs