Advertisement
Google Ads BL

తెలుగు ప్రేక్షకులకి ‘ఝాన్సీ’ అవసరమట!


ప్రతి మహిళా చూడదగ్గ చిత్రం ఝాన్సీ,  ఆగష్టు 17 విడుదల అవుతుంది - కోనేరు కల్పన

Advertisement
CJ Advs

తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగులో ఝాన్సీ పేరుతో ఈ నెల ఆగష్టు 17 న విడుదలకు సిద్ధంగా ఉంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో  ప్రపంచవ్యాప్తంగా అధిక థియేటర్లలో విడుదల చేస్తున్నట్లుగా నిర్మాతలు తెలుపుతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలలో ఒకరైన కోనేరు కల్పన మాట్లాడుతూ.. జ్యోతిక గారు అంటే నాకు చాలా ఇష్టం. వారి నటన మహా అద్భుతం. వారు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా తన విశ్వరూపంని చూపించారు. సినిమా చూసిన వెంటనే మన తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా ఖచ్చితంగా ఇవ్వాలి అని యస్వంత్ మూవీస్ బ్యానర్‌తో కలిసి మేము ఈ సినిమాని విడుదల చేస్తున్నాము. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మంచి ఆఫర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అధిక థియేటర్లలో ఆగస్ట్ 17న విడుదల చేస్తున్నాము. 

ఈ సినిమా ప్రతి మహిళా చూడదగ్గ చిత్రం. ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని ఎలా ఎదుర్కొవాలో ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. దర్శకుడు బాల గారికి మన తెలుగులో కూడా మంచి పేరు ఉంది. వారు దర్శకత్వం వహించిన శేషు, శివ పుత్రుడు, వాడు వీడు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు తెలుగులో వచ్చాయి. ఝాన్సీ సినిమా కూడా అంతటి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను.. అని అన్నారు. 

Koneru Kalpana About Jhansi Movie:

Jyothika Jhansi movie Release on August 17th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs