Advertisement
Google Ads BL

అద్భుతం.. ‘ఎన్టీఆర్’ మళ్లీ దిగివచ్చినట్లుంది


బాలకృష్ణ ఏది చేసినా ఫర్‌ఫెక్షన్‌తో ఎంతో కష్టపడి, తాను స్టార్‌ని అని మర్చిపోయి మరీ కష్టపడతాడు. ఈ వయస్సులో కూడా ఆయన యంగ్‌ హీరోల కంటే ఎంతో బిజిబిజీగా సినిమా జయాపజయాలకు అతీతంగా చిత్రాలను చేస్తూ ఉంటాడు. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం బాలయ్య ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎన్టీఆర్‌’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ముహూర్తం రోజు ఖాకీ డ్రస్సులో చైతన్యరథంపై కూర్చుని కనికనిపించకుండా పోస్టర్‌ని విడుదల చేశారు. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

Advertisement
CJ Advs

దర్శకుడు తేజ ఈ చిత్రం నుంచి బయటకి వచ్చాడు. అయినా బాలయ్య మాత్రం తన పట్టు వదలలేదు. ఎంతో టాలెంట్‌ ఉండి తనతో వందో చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని అద్భుతంగా, అతి తక్కువ సమయంలో తీసి చరిత్ర సృష్టించిన క్రిష్‌ జాగర్లమూడికి ఈ బాధ్యతలు అప్పగించాడు. ఇన్ని జరుగుతున్నా ఈ చిత్రం విషయంలో ప్రజలలో ఎన్నో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటన్నింటికి బాలయ్య-క్రిష్‌లు ఒకే ఒక్క ఫస్ట్‌లుక్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టారు. హఠాత్తుగా స్వాతంత్య్రదినోత్సవ కానుకగా ఈ చిత్రంలోని బాలయ్య తన తండ్రిలా ఉన్న గెటప్‌ పోస్టర్‌ని విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ పోస్టర్‌లో బాలయ్యని చూసిన ఎవరైనా ఆయన తండ్రి ఎన్టీఆరే అనుకోవడం ఖాయమని చెప్పాలి. 

అంతలా తన గెటప్‌, హావభావాలతో బాలయ్య మెప్పిస్తున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి, ఎప్పటిలా తన ఎడం చేతిని చూపిస్తూ ఉన్న బాలయ్యతో కూడిన ఈ పోస్టర్‌ ఈ చిత్రంపై ఉన్న అంచనాలను ఏకంగా వేయి రెట్లు పెంచిందనే చెప్పాలి. ఈ లుక్‌ చూసి అందరూ అద్భుతం అంటున్నారు. మరి ఇతరుల పరిస్థితే అలా ఉంటే ఇక ఎన్టీఆర్‌, బాలకృష్ణ అభిమానులైన నందమూరి ఫ్యాన్స్‌కి ఇది సూపర్‌కిక్‌ అనే చెప్పాలి. అంతేకాదు.. ఈ లుక్‌ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక ఈ చిత్రం నిర్మాణంలో కూడా బాలయ్య భాగస్వామి కావడం, వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించడం తెలిసిందే. 

Tremendous Response to Balayya’s NTR Look:

Independence Day Special gift to Nandamuri Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs