Advertisement
Google Ads BL

మనకు రావాల్సిన వాటి కోసం కృషి చేస్తా: సి. కళ్యాణ్


జాతీయ సినీ కార్మిక వెల్ఫేర్ ఫండ్ కమిటీ ద్వారా మన తెలుగు సినిమా కార్మికులకి మంచి న్యాయం జరుగుతుంది - సి కళ్యాణ్ 

Advertisement
CJ Advs

సినిమా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సినీవర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటి నియామకం జరిగింది. ప్రతిసారీ మూడేళ్ల పాటు ఉండే ఈ కమిటీ ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన జయప్రకాష్ నారాయణ్ వల్లూరు నియమితులయ్యారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో కూడిన 20 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో తెలుగు సినిమా రంగం నుంచి నిర్మాత సి కళ్యాణ్ కు కమిటి మెంబెర్‌గా చోటు దక్కింది. ఆర్టికల్ 33, 1984 ప్రకారం కేంద్ర ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది. గత జూలై31న ఈ కమిటీ నియామకం పూర్తయింది. ఆ రోజు నుంచి మూడేళ్ల పాటు ఈ సినీ వర్కర్స్ వెల్ఫేర్ కమిటీ కేంద్రప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. 

దేశవ్యాప్తంగా ఎంతో పోటీ ఉన్నా.. ఒక తెలుగు వ్యక్తికి ఈ కమిటీ ఛైర్మన్ అవకాశం రావడం విశేషం. అలాగే తెలుగు పరిశ్రమ నుంచి కేవలం సి కళ్యాణ్‌కు మాత్రమే ఈ కమిటీలో చోటు దక్కింది. ఇక వృత్తి ఉపాధి కల్పనల డైరెక్టర్ జనరల్ ఈ కమిటీకి వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో కీలకంగా పనిచేస్తోన్న ఎక్స్ అఫీషియో సభ్యులు మొదటి ఐదు స్థానాల్లో సభ్యులుగా ఉంటారు. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేయబడిన ప్రతినిధులు కమిటీలో కీలకంగా వ్యవహరిస్తారు. ఈ మేరకు వీరి ఎంపిక పత్రాన్ని కేంద్ర ప్రభుత్వ లేబర్ వెల్ఫేర్ జనరల్ సెక్రటరీ కల్పనా రాజ్ సింఘాట్ అధికారికంగా ప్రకటించారు..

ఈ సందర్భంని పురస్కరించుకుని సి కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ..సినీవర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటిలో  కేంద్ర ప్రభుత్వం నాకు కమిటి మెంబెర్‌గా అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్న ప్రతీ కార్మికుడికి న్యాయం చేసేలా నేను చూస్తాను. ముఖ్యంగా ఆరోగ్య భీమా, జీవిత భీమా చాలా ముఖ్యం. మన తెలుగు కార్మికులందరికి అవి వచ్చేలా నేను చూస్తాను. మనకి రావాల్సిన అన్ని సదుపాయాలు వచ్చేలా కృషి చేస్తాను. అని అన్నారు. 

ఇంకా మాట్లాడుతూ.. ఈ వారం కల్యాణ చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై జ్యోతిక నటించిన ఝాన్సీ సినిమా 17న విడుదలవుతోంది. తర్వాత ప్రభుదేవా నటించిన లక్ష్మి చిత్రం వచ్చే వారం 24న విడుదల అవుతోంది. రెండు సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.. అని తెలిపారు.

C Kalyan Member in National Cine Workers Welfare Fund Committee:

C Kalyan Elected as  National Cine Workers Welfare Fund Committee Member
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs