Advertisement
Google Ads BL

వీరరాఘవుడు.. ఈసారి కనికరించేలా లేడుగా!


త్రివిక్రమ్ - ఎన్టీఆర్ కాంబోలో మొదటిసారి వస్తున్న అరవింద సమేత - వీర రాఘవ సినిమా  మీద భారీ అంచనాలు ఉన్నాయి. జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటున్న అరవింద సమేత సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుపుకుంటోంది. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయాలని ఈ సినిమా నిర్మాతలైన హారిక అండ్ హాసిని వారు నిర్ణయించుకున్నారు. మరి సినిమా విడుదల దగ్గర పడుతుంది గనక సినిమా మీద అంచనాలు పెంచాలంటే... అరవింద లుక్స్‌తో పాటుగా టీజర్ ఇలా ప్రమోషన్స్ హంగామా మొదలు పెట్టారు అరవింద టీమ్. ఇక ఈ ప్రమోషన్స్‌ని కూడా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలతో మొదలు పెట్టింది అరవింద సమేత టీమ్. అందులో భాగంగానే ఈ రోజు అంటే ఆగష్టు 15న అరవింద సమేత టీజర్‌ని వదిలారు.

Advertisement
CJ Advs

మరి ముందు నుండి చెబుతున్నట్టే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ భాషను దంచేస్తున్నాడు. అలాగే త్రివిక్రమ్ కూడా ఎప్పుడు ఫన్‌తో కూడిన యాక్షన్‌తోనే సినిమా చేస్తూ వస్తున్నాడు. మరి మొదటిసారి ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ తన పంధాని మార్చుకున్నాడా? అనే డౌట్ మాత్రం ఈ అరవింద టీజర్ చూస్తుంటే అనిపించకమానదు. ఎందుకంటే... ఈ టీజర్ మొత్తం యాక్షన్‌తో కూడుకుని ఉంది. అస్సలు కామెడీని యాడ్ చెయ్యకుండా కేవలం మాస్‌ని చూపించేశాడు. అరవింద సమేత టీజర్ బ్యాగ్రౌండ్ లో జగపతిబాబు వాయిస్ ఓవర్‌తో  ‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అంటూ స్టార్ట్ చేసి.. ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్‌తో ఎండ్ చేశారు. ఇక ఎన్టీఆర్ కత్తి చేతబట్టుకుని.. విలన్స్‌ని ఇరక్కొడుతూ.. సిక్స్ ప్యాక్‌లో అదరగొట్టేశాడు. ఎన్టీఆర్ కుర్చీని ఎగరేసే సీన్ ఉంది చూశారూ..అబ్బబ్బ ఏముందిరా అనిపిస్తుంది ఆ సీన్.

ఇక ఈ టీజర్‌లో మరో హైలెట్ ఏమిటంటే.. ఎన్టీఆర్ డైలాగ్. ‘కంటపడ్డవా కనికరిస్తానేమో… వెంటపడ్డానా నరికేస్తాఓబా’ అంటూ చెప్పిన డైలాగ్ ఒక రేంజ్‌లో పేలిందనే చెప్పాలి. మరి మాస్.. కాదు కాదు ఊరమాస్ లెక్క ఉంది అరవింద టీజర్. ఎప్పుడూ కామెడీకి పెద్ద పీట వేస్తూ.. తన మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టే త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో ఈ రేంజ్ మాస్ ఎంటర్‌టైనర్ తియ్యడం మాత్రం స్పెషల్‌గానే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ కూడా పులిలా గాండ్రిస్తున్నాడు. అరవింద సమేత ఫస్ట్ లుక్ తోనే ఇరగదీసిన ఎన్టీఆర్.. ఇప్పుడు అరవింద టీజర్‌తో దుమ్ము రేపాడు. ఇక జగపతి బాబు కూడా మాంచి పవర్ ఫుల్ పాత్రలో దర్శనమిచ్చేలా ఉన్నాడు. ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు.. అరవిందగా పూజ హెగ్డే, ఎన్టీఆర్ ఎక్స్ లవర్ గా ఇషా రెబ్బ కనబడుతున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Click Here to Teaser 

Aravinda Sametha Teaser Released:

Tremendous Response To Aravinda Sametha Teaser
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs