Advertisement
Google Ads BL

చిరంజీవి క్లాప్‌తో ఈ నటుడి జర్నీ మొదలైందంట


గూఢచారి సక్సెస్ మీట్ లో ఘనంగా జగపతి బాబు 30 ఇయర్స్ సెలెబ్రేషన్స్.

Advertisement
CJ Advs

అడవి శేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ ‘గూఢచారి’.. శోభిత ధూళిపాళ హీరోయిన్.. అలనాటి హీరోయిన్ సుప్రియ ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.. టీజర్ , ట్రైలర్ లతో మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలైన తొలి రోజునుంచే మంచి వసూళ్లను రాబట్టుకుని సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన థ్యాంక్స్ మీట్ నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి జగపతి బాబు ముఖ్య అతిధిగా హాజరు కాగా అయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలయ్యింది.. ఈ సందర్భంగా ఆ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.. 

ఈ సందర్భంగా నటుడు జగపతి బాబు మాట్లాడుతూ... గూఢచారి సినిమా నాకెంతో స్పెషల్ ఎందుకంటే నా 30 సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది గూఢచారితోనే.. ఇంతకంటే ఏం కావాలి నాకు. ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న నాకు 30 ఏళ్ళు సినిమాలు చేసే అవకాశం కల్పించారు. అందరికి నా స్పెషల్ థ్యాంక్స్. చిరంజీవి గారి క్లాప్‌తో మొదలైన నా ప్రయాణం ఇక్కడిదాకా వచ్చింది. అందరిలాగా నేను కూడా ఓ స్టార్ అవబోతున్నానని అప్పుడు అనిపించింది. కానీ వరుసగా 10 ఫ్లాప్‌ల తర్వాత కూడా నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు. ఇక ఈ గూఢచారి థ్యాంక్స్ మీట్ ఫంక్షన్‌ని నా కోసం చేసారంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా గురించి చెప్పాలంటే టీం అంతా చాలా బాగా చేశారు. ఏ ఫెసిలిటీ లేకుండా ఈ సినిమాకి అందరు టెక్నిషియన్స్ చాలా బాగా పనిచేశారు. నా 30 ఇయర్స్‌ని ఇంత బాగా సెలెబ్రేట్ చేసినందుకు అందరికి నా ధన్యవాదాలు.. అన్నారు.

హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాతలకి చాలా థ్యాంక్స్. మమ్మల్ని నమ్మిన అభిషేక్ నామా గారికి థ్యాంక్స్. అలాగే మా గూఢచారి ద్వారా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జగపతి బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్. ఒక అద్భుతమైన నటుడు. మేము రాసుకున్న రోల్ ఎవరు చేస్తారు అనుకోలేదు. కానీ జగపతి బాబుగారు చేయడం చాలా సంతోషంగా ఉంది. మా టీంకి ఇంకా మా ఆర్టిస్ట్స్ అందరికి థ్యాంక్స్.. అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. జగపతిబాబు గారికి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఈ సినిమాలో జగపతిబాబు గారు కనపడగానే ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ అంత ఇంతా కాదు. ఈ సినిమా విజయం వెనుక టీం ఉంది. ఈ సినిమా సక్సెస్ అయ్యిందంటే వారే కారణం.. ఈ సినిమాలో నాకు వారి పని కనిపించింది. వారికి మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను.. అన్నారు. 

రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ.. నేను లైఫ్ లో మర్చిపోలేని సినిమా గాయం 2. జగపతి బాబు గారి గొంతంటే నాకిష్టం. మీతో కలిసి ఇప్పుడు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఎంత గొప్ప కథ ఇచ్చిన దానికి మించిన విజువల్ స్క్రీన్ మీద ఉండాలి అది శశి చాలా బాగా చేశాడు.. సినిమా హిట్ అయ్యినందుకు చాలా హ్యాపీగా ఉంది..అన్నారు.

దర్శకుడు శశి కిరణ్ టిక్క మాట్లాడుతూ.. ముందుగా జగపతిబాబు గారిని ఈ సినిమాకి అనుకున్నప్పుడు ఇంత మంచి మనిషిని ఈ రోల్ లో ఎలా చూపించాలి అని అనుకున్నాను. కానీ ఏ రోల్ అంటే ఆ రోల్ కి వెళ్లి చేసే గొప్ప నటుడు అన్నారు... ఆయనతో చాలా కంఫర్ట్‌గా షూటింగ్ చేయవచ్చు.. అన్నారు.

వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ.. ఒక ప్లాన్ ప్రకారం జగపతిబాబు గారిని ఈ సినిమాలో ఇంతవరకు రివీల్ చేయలేదు. అందుకే ఈ సక్సెస్  మీట్ ద్వారా ఆయనకు 30 ఇయర్స్ సెలబ్రేషన్ చేయాలనుకున్నాము. సినిమా హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. ఓవర్సీస్‌లో మేమే ఈ సినిమాను రిలీజ్ చేశాము. మొదటి రెండు రోజులకన్నా నిన్న మొన్నా కలెక్షన్స్ బాగున్నాయి. సినిమా విజయం వెనకనున్న అందరికీ నా థ్యాంక్స్.. అన్నారు.

Goodachari Success Meet Details:

Jagapathi Babu Completes 30 Years Cine Carrier. GoodaChari Team Celebrates Jagapathi babu at Success Meet.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs