నేటితరానికి తెలియకపోవచ్చు గానీ ‘చిత్రలహరి’ అనే పేరు తెలుగు రాష్ట్రాలలో నాడు ఎంతో ఫేమస్. దూరదర్శన్ మాత్రమే దిక్కుగా ఉన్న ఆ రోజుల్లో చిత్రలహరి పేరుతోనే బుల్లితెరపై సాంగ్స్ అరగంట పాటు వచ్చేవి. ఆ పాటల కోసం నాడు అందరు ఆ ప్రోగ్రాం వచ్చే సమయానికి టివిలకు అతుక్కుపోయేవారు. ఇక విషయానికి వస్తే ఈమద్య మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌కి ఏదీ అచ్చిరావడం లేదు. వరుస పరాజయాలలో ఈయన సతమతమవుతున్నాడు. ‘నక్షత్రం, విన్నర్, జవాన్, ఇంటెలిజెంట్, తేజు.. ఐ లవ్ యు’ ఇలా ఆయన ఏ జోనర్ చిత్రం చేసినా ఫ్లాప్ అవుతోంది. దాంతో వరుసగా మూడు నాలుగు చిత్రాల విజయంతోనే ఏకంగా 25కోట్ల వరకు మార్కెట్ ఏర్పరచుకున్న తేజు ఇప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. వినాయక్, కృష్ణవంశీ, కరుణాకరన్ వంటి వారు కూడా ఆయనకు హిట్స్‌ని అందించకలేకపోతున్నారు.
మరోవైపు మామయ్యలను ఇమిటేట్ చేయడం, రీమిక్స్ సాంగ్స్‌ని పెట్టుకోవడం, మామయ్యల తరహా కథలను, నటనను, దర్శకులను, యాక్షన్‌ని నమ్ముకుంటూ రావడం ఆయనకు పెద్ద మైనస్‌గా మారుతోంది. రామ్‌చరణ్ కూడా తన తండ్రి పాటలను ఎక్కువగా రీమిక్స్ చేసే ధైర్యం చేయలేని పరిస్థితుల్లో ఉంటే తేజు వాటి వెంట వెంపర్లాడటం మెగాభిమానులకు కూడా నచ్చడం లేదు. మొదట్లో వరుణ్‌తేజ్ కంటే సాయిధరమ్‌తేజ్ బెటర్ అనిపించినా కూడా చివరకు కుందేలు, తాబేలు కథలా వరుణ్‌తేజే ఇప్పుడు విభిన్న చిత్రాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.
ఇక ‘నేను..శైలజ’ వంటి హిట్‌ని రామ్‌కి అందించిన దర్శకుడు కిషోర్‌తిరుమల. వరుస ఫ్లాప్‌లలో ఉన్న రామ్ కెరీర్‌ని ఆయన ఈ చిత్రంతో పట్టాలెక్కించాడు. కానీ ఆ తర్వాత షరా మామూలుగా రామ్ ‘హైపర్’ వంటి చిత్రాలు చేసి దెబ్బలు తింటున్నాడు. అదే సమయంలో రామ్‌తో కిషోర్‌తిరుమల చేసిన రెండో చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం బాగుందని టాక్ వచ్చినా దానిని నిలబెట్టుకోవడంలో యూనిట్ విఫలం చెందింది. కిషోర్ తిరుమలతో వెంకటేష్ ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ చేయాలని భావించి చివరి నిమిషంలో తప్పుకున్నాడు. ఇక కిషోర్ తిరుమల నానికి ఓ సబ్జెక్ట్ చెప్పి ‘చిత్రలహరి’ అనే టైటిల్‌తో సినిమా చేయాలని భావించాడు.
కానీ ‘కృష్ణార్జునయుద్దం’ ఫ్లాప్‌తో నాని కూడా ఇప్పుడు వైవిధ్యభరితమైన చిత్రాలు చేయాలని భావిస్తున్నాడు. ఇలాంటి సమయంలో కిషోర్ తిరుమలతో సాయిధరమ్‌తేజ్ ఓ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. నానికి అనుకున్న టైటిల్‌నే దర్శకుడు తేజుకి కూడా ఫిక్స్ చేసి ‘చిత్రలహరి’ అనే టైటిల్‌ని ఖరారు చేశాడని సమాచారం. ఇక ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్‌స్టోరీ అని, ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటే వారి పేర్లే ‘చిత్ర’, ‘లహరి’ అని తెలుస్తోంది. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో తేజు డిఫరెంట్ గెటప్‌తో కనిపిస్తాడట. మొత్తానికి ఈ చిత్రం తేజుకే కాకుండా దర్శకుడు కిషోర్‌తిరుమలకి కూడా ఎంతో కీలకమైనదేనని చెప్పాలి.