రాజకీయాలలో పరిణతి చాలా అవసరం. నోరు అదుపులో లేని వారు తాత్కాలికంగా ఫైర్‌బ్రాండ్ అనో, మరోటి అనో వార్తల్లో నిలుస్తారే గానీ వారికి లాంగ్ స్టాండింగ్ ఎక్కువ. దీనికి నన్నపనేని రాజకుమారి, మారెప్ప వంటి వారే కాదు... రేణుకాచౌదరి నుంచి రోజా వరకు ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక విషయానికి వస్తే జగన్ పార్టీలో కేవలం నోరు పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడే వారికే విలువ ఎక్కువ. రోజా, అంబటి రాంబాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విజయసాయిరెడ్డి.. ఇలా ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. రాజకీయ నాయకుడు కావడం సులభమే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇలాంటి రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు. కానీ రాజనీతిజ్ఞునిగా పేరు తెచ్చుకోవడం మాత్రం కష్టం. అది వాజ్‌పేయ్, పివి నరసింహారావు, మన్మోహన్‌సింగ్, చంద్రబాబు వంటి వారిని ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇక పవన్ విషయానికి వస్తే ఆయనకు అసహనం ఎక్కువ అనేది అందరికీ తెలిసిందే. కానీ ఆయన నటునిగా గానీ, రాజకీయ నాయకునిగా గాని సమస్యలపై, అవినీతిపై స్పందిస్తున్నాడే గానీ రాజకీయాలలో లేని కుటుంబ సభ్యులను, ఇతరులను గబ్బు చేయడం లేదు. కానీ ఈ విష సంస్కృతికి శ్రీకారం చుట్టింది మాత్రం జగనే అని చెప్పవచ్చు. మన జీవితంలో ఏ ప్రతిపక్ష నాయకుడు, చివరకు జగన్ తండ్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కూడా అనని నీచమైన భాషను జగన్ వాడుతున్నాడు. పవన్.. నాకు నీతులు చెబుతాడా? ఈయన గురించి మాట్లాడాల్సిరావడం మన ఖర్మ? ఆయన కార్లు మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడని నానా మాటలు అన్నాడు. రోజా అయితే బొల్లి ఉండే వాడు రాజకీయాలకు పనికిరాడు అంది. ప్రజారాజ్యం సమయంలో పవన్‌కళ్యాణ్ భార్య రేణుదేశాయ్ కూడా సినీ నటే కదా...! మరి ఆమె ఎందరి పక్కల్లో పడుకుంది? వంటి నీచమైన భాష ఉపయోగించింది.
ఇక జగన్ పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేసి తానేదో గొప్పగా మాట్లాడానని భావిస్తున్నాడు. కానీ అదే జగన్ భార్య వైఎస్ భారతి మీద కథనాలు వస్తే మాత్రం కుటుంబ సభ్యులను రాజకీయ రొచ్చులోకి ఎందుకు దింపుతారు? అని ప్రశ్నిస్తున్నాడు. అంటే తాను చేస్తే సంసారం, ఎదుటి వారు చేస్తే వ్యభిచారం అనేది ఆయన నైజం అని అర్ధమవుతోంది. కాగా జగన్ పవన్‌పై చేసిన విమర్శలకు పవన్ మరోసారి స్పందించాడు. ఆయన నిడదవోలులో మాట్లాడుతూ, మీ అందరితో పోల్చుకుంటే నా వ్యక్తిగత జీవితం ఎంతో శుభ్రమైంది. మీలాగా నేను నిజాలను దాయను. జీవితాన్ని దాచుకోను. మీరు మెచ్చుకుంటే మెచ్చుకోండి.. చీదరించుకుంటే చీదరించుకోండి. నేను బయట ఒకటి, లోపల ఒకటి పెట్టుకునే మనిషిని కాదు. ఉదాహరణకు నిడదవోలులో రైల్వే బ్రిడ్జ్ కట్టలేదు? ఏమిటి? అని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా పవన్‌కి ముగ్గురు భార్యలు అంటారు. ఒక పెళ్లి చేసుకుని మీలా బలాదూర్‌గా తిరిగే వ్యక్తిని కాదు నేను. మంచో చెడో జరిగింది. నాకేమీ ఒళ్లు పొగరెక్కి పెళ్లిళ్లు చేసుకోలేదు. నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టమే. పవన్ బయటివారి గురించి ఏడుస్తూ ఉంటాడు. వాళ్లకేమైంది... వీళ్లకేమైంది.. అక్కడ బ్రిడ్జ్ కూలిపోయిందటగా అని పక్క విషయాల మీద ఏడుస్తుంటాడు.
దాంతో నా పక్కన ఉండే వారికి సుఖం ఉండదు. అందరు నేను విలాసవంతమైన సినిమా స్టార్‌ని అనుకుంటారు. ఓ గదిలో మూలకూర్చుని నేను పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటాను. నా జీవితంలో పార్టీలు ఉండవు.. పబ్స్ ఉండవు. ఆవుల వద్దో, గేదెల వద్దో లేదా ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాను. పవన్‌తో సుఖం ఏముంది? ఎప్పుడు ఒత్తిడే.. అందుకే నా వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నమైపోయింది. నేను ఏడ్చాను.. ఇబ్బంది పడ్డాను అని చెప్పుకొచ్చాడు. ఈ విషయంలో పవన్ చెప్పింది అక్షరాలా వాస్తవం అనే చెప్పాలి.