Advertisement
Google Ads BL

శ్రీనివాసకళ్యాణం రిజల్ట్‌తో ఈ హీరోలు హ్యాపీ!


ప్రస్తుతం ఇండస్ట్రీలో దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం సినిమాపై హాట్ హాట్ చర్చలు ఇంకా ముగియలేదు. గత గురువారం విడుదలైన నితిన్, రాశి ఖన్నాలు జంటగా తెరకెక్కిన ఈ సినిమాని శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేశాడు. అయితే మొదటి షోకే శ్రీనివాస కళ్యాణం సినిమా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. దిల్ రాజు ప్రమోషన్స్ కూడా శ్రీనివాస కళ్యాణం సినిమాని హిట్ చెయ్యలేకపోయింది. అయితే శ్రీనివాస కళ్యాణం సినిమా కథని నిర్మాత దిల్ రాజు బాగా నమ్మాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉన్న ఈ కథతో సతీష్ వేగస్నా దర్శకుడిగా స్టార్ హీరోలెవరైనా ఒకరితో ఈ సినిమా ని దిల్ రాజు నిర్మించాలనుకున్నాడు. అందుకే శ్రీనివాస కళ్యాణం కథతో సతీష్ వేగేశ్నతో కలిసి దిల్ రాజు ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ లను కలిసాడు. అందుకే శ్రీనివాస కళ్యాణం సినిమా మొదలయ్యే ముందుగా ఎన్టీఆర్ తో దిల్ రాజు - సతీష్ వేగేశ్న కాంబోలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరగడం.. తర్వాత ఎన్టీఆర్... సతీష్ వేగేశ్న చెప్పిన కథకు ఇంప్రెస్స్ అవ్వక.. దిల్ రాజుకి ఈ విషయం చెప్పి ఆ సినిమా చెయ్యనని చెప్పేయడం జరిగింది.

Advertisement
CJ Advs

ఇక మహేష్ బాబు కూడా ఇప్పటికే బ్రహ్మోత్సవం సినిమా కుటుంబ కథా చిత్రంగా చేసి దెబ్బతిని ఉన్నాం.. అందుకే ఇప్పట్లో ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ చేయలేనని తప్పించుకోవడం.. తర్వాత రామ్ చరణ్ కూడా ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్న టైం లో ఇలా కుటుంబ కథా చిత్రం చేయలేనని... దిల్ రాజు చెప్పెయ్యడంతో.. అదే కథతో నితిన్ తో సినిమా చేద్దామని దిల్ రాజు కూడా డిసైడ్ అయ్యాడట. అందులోను అప్పటికే ప్లాప్స్ లో ఉన్న నితిన్ దిల్ రాజుతో సినిమా చెయ్యడం కోసం కాచుకుని కూర్చోవడం... అలా వచ్చిన అవకాశంతో ఈ సినిమాని ఒప్పుకోవడం జరిగిపోయాయి. 

ఇక నితిన్ -రాశి ఖన్నాలు జంటగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫలితం అందరికి తెలిసిందే. ఇక శ్రీనివాస కళ్యాణం సినిమా కథని రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబులు ఇప్పుడు తెలివైన హీరోలుగా కనబడుతున్నారు. అలా ఆ సినిమాని రిజెక్ట్ చేసి ఈ ముగ్గురు టాప్ హీరోలు ఓ  ప్లాప్ ని తప్పించుకున్నారన్నమాట. 

Charan, NTR and Mahesh Happy with Srinivasa Kalyanam Result:

Top Heroes Rejected Srinivasa Kalyanam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs