Advertisement
Google Ads BL

'థ్యాంక్యూ'..మీకు ఎలా చెప్పాలో: దిల్ రాజు


'శ్రీనివాస క‌ళ్యాణం' సినిమాను ఆద‌రిస్తున్న ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కృత‌జ్ఞ‌త‌లు - నిర్మాత దిల్‌రాజు

Advertisement
CJ Advs

యూత్‌స్టార్ నితిన్‌, రాశీ ఖన్నా, నందితా శ్వేత హీరో హీరోయిన్స్‌గా న‌టించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'శ్రీనివాస క‌ళ్యాణం'. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీశ్‌, లక్ష్మణ్  ఈ చిత్రాన్ని నిర్మించారు. 'శ‌త‌మానం భ‌వ‌తి` వంటి నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని తెర‌కెక్కించిన స‌తీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆగ‌స్ట్ 9న ఈ సినిమా విడుద‌లైంది. 

ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో జ‌రిగిన స‌క్సెస్ మీట్‌లో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - 15 సంవత్సరాలు.. 30 సినిమాలు చేశాను. ఈరోజు ఉన్నంత కన్‌ఫ్యూజన్‌లో ఎప్పుడూ లేను. ఇన్నేళ్ల కెరీర్‌లో సక్సెస్‌ పర్సంటేజ్‌తో ఎక్కువ సినిమాలు చేశాను. అప్పుడప్పుడు స్పీడు బ్రేకులు వచ్చాయి. అలా వచ్చినప్పుడల్లా మళ్లీ సక్సెస్‌ సాధిస్తూ వస్తున్నాను. లక్కీగా గత ఏడాది ఇండస్ట్రీలోఎవరూ చేయలేని విధంగా ఆరు సినిమాలు చేశాను. అన్ని సినిమాలు సక్సెస్‌ఫుల్‌ అయ్యాయి. మూడు వారాల క్రితం వచ్చిన లవర్‌ పెద్దగా వర్కవుట్‌ కాలేదు. 'శ్రీనివాస క‌ళ్యాణం' విషయంలో ముందు నుండి ఓ మంచి సినిమా వస్తుందని పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ వచ్చాయి. ప్రివ్యూ సినిమా చూసినవారు అప్రిషియేట్‌ చేసినప్పుడు మాకు మంచి సినిమా చేశామని ఇంకా నమ్మకం పెరిగింది. యు.ఎస్‌ నుండి తొలి రివ్యూ వచ్చిన తర్వాత అది కూడా పాజిటివ్‌గానే వచ్చింది. అందరూ చెప్పినట్లుగా మంచి సినిమా చేశామని నమ్మకం కలిగింది. 80-90 శాతం మందికి సినిమా నచ్చిందని అనిపించింది. సినిమా పూర్తయిన తర్వాత.. మధ్యాహ్నం నుండి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చేసింది. యూత్‌, రివ్యూవర్స్‌, అందరూ సోషల్‌ మీడియాలో మిక్స్‌డ్‌ వార్తలు స్ప్రెడ్‌ చేశారు. గురువారం, శుక్రవారం సినిమా కలెక్షన్స్‌ పడిపోయాయి. అయితే శనివారం, ఆదివారం ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఎక్కువ మంది థియేటర్స్‌కు వచ్చారు. సినిమా బావుందని అన్నారు. కొందరేమో బావుంది.. ఇలాంటి సినిమాలే చేయమని అన్నారు. కొందరేమో మరోలా అన్నారు. అని ఆలోచించాను. మేం చేసింది తప్పా.. ఒప్పా.. అని ఆలోచించి టైటిల్‌తో ఉన్న కార్డుని ప్రింట్‌ చేయించాను. అందులో పరవాలేదు.. బాగుంది.. చాలా బాగుంది.. బాగా లేదు.. అనే చాయిస్‌లను ప్రింట్‌ చేయించాను. రెండు రాష్ట్రాలో 60-70 థియేటర్స్‌కు ఈ కార్డ్స్‌ను పంపి ఆడియెన్స్‌ ఎలా స్పందిస్తున్నారో ఇంటర్వెల్‌లో తెలుసుకోమని పంపాను. ప్రేక్షకుల కామెంట్‌తో పాటు పేరు, కాంటాక్ట్‌ నెంబర్‌ కూడా తీసుకున్నాం. ఆరు షోలకు స్పందనను తెప్పించాను. యూత్‌, సోషల్‌ మీడియాతో పోల్చితే ఆడియెన్స్‌ పల్స్‌ ఒకలా ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువ చేస్తే పక్కకు వెళ్లిపోతామని.. మేం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా చేశాం. అయితే అందరూ మెచ్చుకునేలా సినిమా చేయాలని నేను పాజిటివ్‌గానే తీసుకుంటాను. ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఈ సినిమాను మౌత్‌ టాక్‌తో ముందుకు తీసుకెళతారని ఆశిస్తున్నాను. సతీశ్‌ దర్శకత్వంలో మా బ్యానర్‌లో 'థ్యాంక్యూ' అనే సినిమా చేయబోతున్నాను. 'మీకు ఎలా చెప్పాలో..' అనేది క్యాప్షన్‌. ఓ మనిషి జీవితానికి సంబంధించిన కథ. ఈ సినిమాలో ఏదైతే ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అయ్యామని, యూత్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ అయ్యామని అనుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ఎవరో ఓ కథ చెబితే..నాకు నచ్చి... ఆ కథన తీసుకుని సతీశ్‌కు చెబితే.. 'చేద్దాం సార్‌' అని తను అన్నాడు. ఓ అద్భుతమైన కథను తయారు చేసి సినిమా రూపంలో ఆడియన్స్‌ ముందుకు వస్తాం.. అన్నారు. 

చిత్ర దర్శకుడు సతీశ్‌ వేగేశ్న మాట్లాడుతూ - సినిమా ఫలితం గురించి దిల్‌రాజుగారు వివరించారు. ఇక డైరెక్టర్‌గా నా పనిని చక్కగా నిర్వర్తించాను. ఏ కథ అయితే చెప్పానో దాన్ని అలాగే తెరపై చూపించాను. దాన్ని నిర్మాత ఫీలై అప్రిషియేట్‌ చేస్తే దర్శకుడిగా నేను సక్సెస్‌ అయినట్లే. ఆ సక్సెస్‌ను రాజుగారి ద్వారా నేను పొందాను. నన్ను నమ్మి కథ ఓకే చేసిన హీరో, హీరోయిన్‌, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ అందరూ హ్యాపీగా ఫీలైయ్యారు. అది కూడా నా సక్సెస్‌. ప్రీమియర్‌ చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్‌ మంచి సినిమాను విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పడం మరో సక్సెస్‌. ఏ ఫ్యామిలీ ఆడియెన్స్‌ కోసమైతే సినిమా చేశానో.. వారికి సినిమా నచ్చడం మరో సక్సెస్‌. ఓ రకంగా మంచి సినిమా చేశామని ఆనందపడాలో.. మరో వైపు వస్తున్న ట్రాలింగ్‌ చూసి బాధపడాలో తెలియడం లేదు. ప్రేక్షకుల అభినందనలే మా ఆశీర్వాదాలు. మంచి సినిమా చేశామనే తృప్తి కలిగింది.. అన్నారు. 

యూత్‌స్టార్ నితిన్‌ మాట్లాడుతూ - నేను డిస్ట్రిబ్యూటర్‌గారి అబ్బాయనే. నాకు కూడా ఈ సినిమా విషయంలో కన్‌ఫ్యూజన్‌ ఉంది. నాకు తెలిసిన సర్కిల్‌లో.. మా పిల్లల పెళ్లిల్లు కూడా ఇలాగే చేయాలని అనుకున్నవాళ్లు ఉన్నారు. సినిమాను నమ్మి, ప్రేమించి చేసిన సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ సినిమాపై టాక్‌ను స్ప్రెడ్‌ చేసి సక్సెస్‌ చేస్తారని భావిస్తున్నాను. ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉంది. నా కెరీర్‌లో ఓ గొప్ప సినిమా. మంచి సినిమా ఉండే లైబ్రరీలో ఈ సినిమా కూడా ఉంటుంది. సతీశ్‌గారి కాంబినేషన్‌లో సినిమా చేస్తాను. అది 'థాంక్యూ' మూవీనే అనుకుంటున్నాను. ఇదే కాంబినేషన్‌లో వెంటనే హిట్‌ కొడితే ఆ కిక్కే వేరప్ప.. అన్నారు. 

సీనియ‌ర్ న‌టి సితార మాట్లాడుతూ - శ్రీనివాసకళ్యాణం నా కెరీర్‌లో మెమొరబుల్‌ మూవీగా నిలిచిపోయింది. ముఖ్యంగా అమ్మాయిలు సినిమాను బాగా చూస్తున్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌. అవకాశం ఇచ్చిన దిల్‌రాజుగారికి, సతీశ్‌గారికి థాంక్స్‌.. అన్నారు. 

హీరోయిన్‌ నందితా శ్వేత మాట్లాడుతూ - అందరూ మెచ్చుకునే పాత్రలనే చేయాలని ఇండస్ట్రీలోకి వచ్చాను. అలాంటి పాత్రలనే చేస్తున్నాను. శ్రీనివాస కళ్యాణంలోని నా పద్దు క్యారెక్టర్‌కి అందరూ కనెక్ట్‌ అవుతున్నారు. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో ఏడాది పాటు మంచి పాత్ర కోసం వెయిట్‌ చేశాను. అయితే ఈ సినిమాలో పద్దు అనే పాత్ర కోసం నన్ను సతీశ్‌గారు సెలక్ట్‌ చేయడం ఆనందంగా ఉంది. అలాగే దిల్‌రాజుగారికి థాంక్స్‌. నితిన్‌, రాశీఖన్నా చాలా మంచి పాత్రల్లో మెప్పించారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌.. అన్నారు.

Srinivasa Kalyanam Movie Success Meet:

Srinivasa Kalyanam Movie Success Meet Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs