Advertisement
Google Ads BL

ఆగస్ట్ 15న వరుణ్ గుడ్ న్యూస్ చెబుతాడంట!


స్వాతంత్ర్య దినోత్సవాన వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డిల స్పేస్ ఫిలిం టైటిల్ మరియు రిలీజ్ డేట్ ఎనౌన్స్ మెంట్ 

Advertisement
CJ Advs

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ అడ్వెంచరస్ ఫిలిం తెరకెక్కుతోంది. నేడు ఈ చిత్రం కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం టైటిల్ ను ఎనౌన్స్ చేయడంతోపాటు.. విడుదల తేదీని ఆగస్టు 15వ తారీఖు ఉదయం 9.30కి ప్రకటించనున్నారు. 

అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యుత్తమ సాంకేతిక విలువలతో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో జీరో గ్రావిటీ టెక్నాలజీతో వేయబడిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరిగింది. వరుణ్ తేజ్ అండ్ టీమ్ అందరూ జీరో గ్రావిటీలో ట్రయినింగ్ కూడా తీసుకొన్నారు. 

అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్న, ఇంకా టైటిల్ నిర్ణయించబడని ఈ చిత్రాన్ని సాయిబాబు జాగర్లమూడి-రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తుండగా.. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని సమర్పిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

నటీనటులు: వరుణ్ తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు...

సాంకేతిక బృందం: దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి,  సమర్పణ: క్రిష్ జాగర్లమూడి, నిర్మాతలు: క్రిష్ జాగర్లమూడి-సాయిబాబు జాగర్లమూడి-రాజీవ్ రెడ్డి, నిర్మాణ సంస్థ: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: ప్రశాంత్ విహారీ, ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ-మౌనిక, యాక్షన్ కొరియోగ్రఫీ: టోడోర్ పెట్రోవ్ లజారోవ్, సి.జి: రాజీవ్ రాజశేఖరన్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

Title of Varun Tej's next to be out on the Independence Day:

Varun Tej and Sankalp Reddy Title and Release Date Announcement on Independence Day
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs