Advertisement
Google Ads BL

'ఆమే నా హీరో' అంటున్న విలక్షణనటుడు!


దేశం గర్వించదగ్గ నటుల్లో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ ఒకరు. ఏపాత్రకైనా ఆయన జీవం పోస్తాడు. తన సహచరనటులైన ఓంపురి, నసీరుద్దీన్‌షా, షబానా ఆజ్మీ, నందితాదాస్‌ వంటి వారితో పాటు ఈయన పేరును కూడా ఇండియన్‌ సినిమా చరిత్ర పుటల్లోకి ఎక్కించాల్సిన నటునిగా ఆయనకు పేరుంది. ఇక రాజకీయ నాయకుడు కూడా అయిన ఆయన ఏది మాట్లాడినా ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తాడు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే సామాన్యంగా ఎవ్వరినీ పొగడని అనుపమ్‌ఖేర్‌ బాలీవుడ్‌ వెటరన్‌ హీరోయిన్‌ సోనాలిబింద్రేపై ప్రశంసల వర్షం కురిపించాడు. హైగ్రేడ్‌ క్యాన్సర్‌తో సోనాలిబింద్రే బాధపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోంది. క్యాన్సర్‌ని ముందుగా గుర్తించకపోవడం వల్ల అది ఆమె శరీరంలోని ప్రతి భాగానికి వ్యాపించింది. కీమో థెరపితో పాటు పలు చికిత్సలను ఆమె తీసుకుంటూ ఉంది. ఇప్పటికే ఆమెకి క్యాన్సర్‌ సోకడం పట్ల నాగార్జున నుంచి ఎందరో తమ సానుభూతిని తెలుపుతు, ఆమెకి భగవంతుడు ధైర్యం అందించాలని కోరారు. అందుకు తగ్గట్లుగానే సోనాలి బింద్రే కూడా ఏమాత్రం క్యాన్సర్‌ని చూసి భయపడకుండా మనోధైర్యంతో వ్యవహరిస్తోంది. 

తాజాగా అనుపమ్‌ఖేర్‌.. సోనాలిబింద్రేని న్యూయార్క్‌లో కలిశాడు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించాడు. సోనాలి బింద్రేతో కలిసి కొన్ని చిత్రాలలో నటించాను. ముంబైలో జరిగిన పలు సమావేశాలు, కార్యక్రమాల సందర్భంగా మేము తరుచుగా కలుసుకున్నాం. కానీ ఆమెతో కలిసి విలువైన సమయం గడిపే అవకాశం న్యూయార్క్‌లో లభించింది. నా దృష్టిలో 'ఆమే నా హీరో' అని ఖచ్చితంగా చెప్పగలను. ఆమె మనోధైర్యానికి హ్యాట్సాఫ్‌ అని పేర్కొన్నాడు. 

Anupam Kher calls Sonali Bendre his 'HERO':

Anupam Kher: Sonali Bendre is my hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs