తమిళంలో హీరోగా తన సత్తా చాటుకున్న యంగ్ స్టార్స్‌లో ధనుష్ ఒకరు. ఈయన సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి అల్లుడయినప్పటికీ ఆయన తన స్వంత ప్రతిభతోనే సినిమాలలో ఈ స్థాయిని చేరుకున్నాడు. ఇలాంటి ధనుష్‌కి 'మారి, విఐపి' తర్వాత సరైన హిట్ లేదు. 'త్రీ, విఐపి2' వంటి పలు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఇక ధనుష్ బహుముఖప్రజ్ఞాశాలి. ఇటీవల దర్శకునిగా మారి రాజ్‌కిరణ్‌తో 'పవర్‌పాండి' చిత్రం తీశాడు, నిర్మాతగా మారి తన మావయ్య రజనీకాంత్-రంజిత్‌పా కాంబినేషన్‌లో 'కాలా' చిత్రం తీసి సినిమా ఆడినా ఆడకపోయినా లాభాలు ఆర్జించాడు. ఇక ఈయన సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా తన ప్రతిభను చూపిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ధనుష్ ఆశలన్నీ ఆయన తాజాగా చేస్తున్న 'మారి2' మీదనే ఉన్నాయి. 'విఐపి' చిత్రం బాగా ఆడటంతో దానికి సీక్వెల్‌గా 'విఐపి2' తీసి భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న ఈయన ఈసారి కూడా సీక్వెల్‌నే నమ్ముకోవడం విశేషం. తాజాగా 'మారి2' చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి బాలాజీమోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
2015లో వచ్చిన 'మారి' చిత్రం మంచి విజయం సాధించడంతో దీని సీక్వెల్‌కి నిర్మాతగా కూడా ధనుషే నిర్మిస్తున్నాడు. ఇక 'మారి'లో ధనుష్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా, 'మారి2'లో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో సాయిపల్లవి ఆటోడ్రైవర్ పాత్రను పోషిస్తుండటం విశేషం. ఇక ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తుండటం విశేషం. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్ 'మారి2'తో పాటు విశాల్ నటిస్తున్న చిత్రంలో కూడా నెగటివ్ పాత్రనే చేస్తుండటం విశేషం. ఇక 'మారి2'లో ధనుష్ ఇప్పటివరకు కనిపించని డిఫరెంట్ గెటప్‌లో కనిపించనుండటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా చెప్పాలి. తన లుక్కే కాదు.. ఈ చిత్రం కూడా భారీ విజయం సాధించి తనకి మరో హిట్‌ని ఇస్తుందనే గట్టి నమ్మకంతో ధనుష్ ఉండటం విశేషం.