సినిమా వారికి సెంటిమెంట్స్ ఎక్కువగానే ఉంటాయి. ఇక వరుస హిట్ చిత్రాల దర్శకునిగా దిల్‌రాజుకి పేరుంది. ఆయన తన బేనర్ పేరును కూడా ఏడుకొండల వాడి పేరు మీద వెంకటేశ్వర క్రియేషన్స్ అని నామకరణం చేశాడు. ఇక ఈయన కృష్ణుడి పేరు, పండుగ వచ్చేలా సునీల్ హీరోగా వాసువర్మ దర్శకత్వంలో వచ్చిన 'కృష్ణాష్టమి' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈయన రామ్ అనే దేవుడి పేరున్న హీరోతో ఇద్దరు దేవుళ్ల పేర్లతో 'రామరామ కృష్ణకృష్ణ' చిత్రం నిర్మించాడు. ఇది కూడా ఫ్లాపే. ఆ మద్య దిల్‌రాజు మాట్లాడుతూ, ఇతర దేవుళ్ల పేరు పెడితే ఏడకొండలవాడికి కోపం వస్తున్నట్లు ఉంది. అందుకే ఇతర దేవుళ్ల పేరుతో తీసిన చిత్రాలు ఫ్లాప్ అవుతున్నాయని చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా ఆయన వేంకటేశ్వరస్వామి పేరు మీదనే నితిన్ హీరోగా 'శ్రీనివాసకళ్యాణం' చిత్రం తీశాడు. ఇది కూడా ఫ్లాప్ జాబితాలోకి వెళ్లిపోయింది. ఇక ఆమద్య నాగార్జున-రాఘవేంద్రరావు కాంబినేసన్‌లో హాధీరామ్‌బాబా జీవితం ఆధారంగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశాడు. దీని వల్ల ఆర్ధికంగా ఆయన ఎంతో నష్టపోయాడు. బహుశా దిల్‌రాజుకి అందరు దేవుళ్లతో వైరం ఏర్పడినట్లుగా ఉంది. ఏడుకొండల వాడిని నమ్ముకున్నా కూడా వర్కౌట్‌కావడం లేదు.
ఎవరికైనా వరుస హిట్స్‌తో పాటు ఇలాంటి డిజాస్టర్స్ కూడా రావడం కామన్. అయితే వరుసగా రెండు మూడు హిట్స్ వస్తే ఈ ఏడాది ఆరు సిక్స్‌లు కొట్టడం ఖాయమని, ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నామని అతివిశ్వాసం చూపి, తన నిర్ణయమే కరెక్ట్ అనుకుంటే మాత్రం భంగపాటు తప్పదనే చెప్పాలి...!