Advertisement
Google Ads BL

గోవిందుడి సీక్రెట్‌ హీరోయిన్స్ వీళ్లేనా..?


అర్జున్‌రెడ్డి చిత్రంతో విపరీతమైన క్రేజ్‌ సాధించిన విజయ్‌దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'గీతాగోవిందం' ఆగష్టు15న స్వాతంత్య్రదినోత్సవ కానుకగా విడుదలకు సిద్దమవుతోంది. ఇందులో మెయిన్‌ హీరోయిన్‌గా రష్మికమండన్న నటిస్తుండగా, మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ చిత్రంలో ఉన్నారని ఆడియో వేడుక సాక్షిగా నిరూపితం అయింది. అయితే ఆ ఇద్దరు ఎవరు అనే విషయాన్ని మాత్రం యూనిట్‌ సస్పెన్స్‌గానే ఉంచుతోంది. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా ఈ చిత్రంలో నటించే మరో ఇద్దరు హీరోయిన్లు వీరేనంటూ ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. గ్లామర్‌ పాత్రలకి దూరంగా ఉంటూ, కథలో కీలకమైన పాత్ర అయితే నిడివిని కూడా పట్టించుకోకుండా నటించే నిత్యామీనన్‌ ఇందులో ఒక హీరోయిన్‌ అని తెలుస్తోంది. అదే నిజమైతే 'అ!' చిత్రం తర్వాత నిత్యా నటించే చిత్రం ఇదే కానుంది. ఇక రెండో హీరోయిన్‌ పేరు మరింతగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 'అజ్ఞాతవాసి, నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా', త్వరలో విడుదల కానున్న 'శైలజారెడ్డి అల్లుడు' హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌ మరో హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. 

ఇక ఒక్క  హీరోయిన్‌ ఉంటేనే రచ్చరచ్చ చేసే నాటీ హీరో విజయ్‌.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఉంటే ఇరగదీస్తాడనే చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం గీతాఆర్ట్స్‌ వారి మూవీ కావడంతో నిత్యామీనన్‌, మరోవైపు వరుసగా ఇద్దరు మెగా హీరోలైన పవన్‌కళ్యాణ్‌, అల్లుఅర్జున్‌ల సరసన నటించిన అను ఇమ్మాన్యుయేల్‌.. అల్లుఅరవింద్‌ అడగాలే గానీ ఖచ్చితంగా చేసే ఉంటారని అంటున్నారు.మరి ఆ ఇద్దరు సీక్రెట్‌ హీరోయిన్లు ఎవరో తెలియాలంటే ఈనెల 15వరకు వెయిట్‌ చేయాల్సిందే. 

Two Secret Heroines in Geetha Govindham Movie:

Nithya Menon and Anu emmanuel in Vijay Devarakonda Geetha Govindham
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs