Advertisement
Google Ads BL

నాగ్ చెప్పినట్లే 'చిలసౌ'కి జరుగుతుందట!


నాగార్జునగారు ఇచ్చిన సపోర్ట్ వల్లే సినిమా అందరికీ రీచ్ అయ్యింది: 'చిలసౌ' సక్సెస్ మీట్ లో రాహుల్ రవీంద్రన్ 

Advertisement
CJ Advs

సుశాంత్, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం 'చిలసౌ'. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్‌ 3న విడుదలైన ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని.. డీసెంట్ హిట్ ఫిలిమ్ గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన స‌క్సెస్‌మీట్‌లో...

హీరో సుశాంత్‌ మాట్లాడుతూ - ఆడియెన్స్‌కు దగ్గర కావడానికి కొత్తగా ఏదైనా చేస్తే బావుంటుందనుకొంటున్న తరుణంలో.. 'చిలసౌ' కథ వినగానే ఇది మనకు మరో కొత్త మెట్టు అవుతుందని అనుకున్నాను. నా నమ్మకం నిజమైంది. ఈరోజు చాలా మంది సినిమా చూసిన వారు మెసేజ్‌లు చేస్తున్నారు. కరెక్ట్‌ సినిమా చేశావని చాలా మంది అనడం హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమా చేయాలంటే మంచి కథ దొరకాలి. నాకు ఈ కథను చెప్పినందుకు రాహుల్‌కి థాంక్స్‌. తను నాకు రెండు కథలు చెబితే.. అందులో చి.ల.సౌ కథతో సినిమా చేయడానికి రెడీ అయిపోయాను. నాకు వచ్చిన అభినందల క్రెడిట్‌ రాహుల్‌కే దక్కుతుంది. బయట సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన సిరుని సినీ క్రియేషన్స్‌ వారికి థాంక్స్‌. సమంత, చైతన్యకు నచ్చితే.. చైతన్య సినిమాలో భాగమవుతానని చెప్పడం.. నాగార్జునగారి పేరు ఎప్పుడైతే పెట్టారో అప్పుడే సినిమాపై నమ్మకం వచ్చేసింది. కొత్తగా చేద్దామనుకునే ఆలోచనతో టీమ్‌ అంతా ముందుకు వచ్చింది. నాతో పాటు హీరోయిన్‌ పాత్ర బావుందని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. రుహనీ శర్మకు మంచి పేరు వచ్చింది. సుకుమార్‌గారు కెమెరా వర్క్‌, ప్రశాంత్‌ విహారి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌.. అన్నారు.

రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ - ప్రీమియర్‌ షో నుండి సినిమా పాజిటివ్‌ టాక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్‌ వచ్చినంత ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదేమో అనిపించేది. ఆ సమయంలో నాగార్జునగారు ఈ సినిమా స్లోగా ఎక్కుతుంది అన్నారు. ఆయన అన్నట్లుగానే.. గత శుక్రవారం కంటే ఈ శుక్రవారం అడ్వాన్స్‌ బుకింగ్‌ ఎక్కువైంది. మేం ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. సినిమా డిప్‌ కాలేదు. నెమ్మదిగా ముందుకెళుతుంది. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు అందరూ థాంక్స్‌ చెబుతున్నారు. అందరూ కొత్త సుశాంత్‌ను చూశామని అంటున్నారు. తను ఈ సినిమా కోసం చాలా డేడికెటేడ్‌గా వర్క్ చేశాడు. ఈ సినిమాను చాలా ప్రేమించి చేశాడు. నిర్మాతలు నెరేషన్‌ విని.. నన్ను నమ్మి సినిమా చేశారు. ఇలాంటి నిర్మాతలు మనకు ఎంతో అవసరం. రుహని చాలా చక్కగా నటించింది. చాలా సిన్సియర్‌గా నటించింది.. అన్నారు.

నిర్మాత జశ్వంత్‌ మాట్లాడుతూ - సినిమా చేసేటప్పుడు రిస్క్‌ చేస్తున్నానని చాలా మంది అన్నారు. కానీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత చాలా మంది ఫోన్‌ చేసి అభినందిస్తున్నారు. సుశాంత్‌కు ఓ వే క్రియేట్‌ అయ్యింది. రాహుల్‌ కొత్తగా సినిమా చేశాడని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నుండి సపోర్ట్‌ చేసిన నాగార్జునగారికి, చైతన్యగారికి థాంక్స్‌.. అన్నారు.

Chi La Sow Movie Thanks Meet :

Chi La Sow Movie Thanks Meet Highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs