Advertisement
Google Ads BL

జ్యోతిక సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్


ఆగష్టు 17 న వస్తున్న జ్యోతిక 'ఝాన్సీ'

Advertisement
CJ Advs

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధంగా ఉంది. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కోనేరు కల్పన మరియు డి అభిరాం అజయ్ కుమార్ కలిసి కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్ సంయుక్తంగా ఆగష్టు 17న విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంచలన దర్శకుడు బాల తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. విక్రమ్ నటించిన సేతు, సూర్య నటించిన నందా, సెన్సషనల్ హిట్ అయిన శివపుత్రుడు, విశాల్ తో వాడు వీడు, ఇలా ఎన్నో విజయాలు అందుకున్న బాల.. జ్యోతికతో నాచియార్ సినిమా తీశారు. తమిళనాడులో ఘన విజయం సాధించింది. జ్యోతిక ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనబడుతుంది. తెలుగులో  ఝాన్సీ పేరుతో ఆగష్టు 17న విడుదలవుతుంది. ఇళయరాజా గారి సంగీతం మరో హైలైట్. జి వి ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు. 

ఈ సందర్భంగా నిర్మాతలు కోనేరు కల్పన మాట్లాడుతూ.. నాచియార్ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల స్వీయ దర్శకత్వంలో నిర్మించబడిన చిత్రమిది. జ్యోతిక  కొంత కాలం గ్యాప్ తరువాత నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. బాల గారి అద్భుతమైన దర్శకత్వం ఒక ఎత్తు అయితే జ్యోతిక గారి నటన మరో ఎత్తు. వీరి ఇద్దరి కలయికలో వచ్చిన ఈ సినిమా తమిళనాడు అంతటా విజయవంతంగా ప్రదర్శింపబడినది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో ఝాన్సీ అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఆగష్టు 17న విడుదల చేస్తున్నాము. తమిళంలో ఎంతో  విజయం సాధించిన ఈ సినిమా పై తెలుగులో అంచనాలు భారీగా ఉన్నాయి. బయర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ ల దగ్గర నుంచి మంచి ఆఫర్ వస్తుంది. తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం నాకుంది.. అని తెలిపారు.

Release Date Fix to Jyothika Jhansi:

Jhansi Movie Release on August 17th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs