మనదేశంలో కుల, మత వివక్ష ఉందని అందరు హిందువులను తప్పుపడుతూ ఉంటారు. అయితే క్రైస్తవులలో కూడా 'రోమన్‌క్యాథలిక్‌లు, పెంతెకొస్తులు, ప్రొటెస్టెంట్స్, బాప్టిస్టులు' ఇలా పలు వేర్వేరు శాఖల వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలలో కూడా ఎంతో తేడా ఉంటుంది. హిందువులు విగ్రహారాధన తప్పని హిందు దేవుళ్ల సైతానులని ఇతర మతస్తులు వాదిస్తూ ఉంటారు. కానీ రోమన్‌క్యాథలిక్ చర్చిలలో ఏసు క్రీస్తు విగ్రహాలు, మేరి మాత విగ్రహాలకు పూజలు చేస్తారు. ఇక ముస్లింలలో కూడా షియాలు, సున్నీలు.. ఇలా ఎన్నో తెగలు ఉన్నాయి. భారతీయ ముస్లింలను ముస్లిం దేశాల ప్రజలు రెండో తరగతి ప్రజలుగా గుర్తిస్తారు. ఇక బౌద్దులు, జైన్‌లతో పాటు పలు మతాలలో ఇలా ఎన్నో వేర్వేలు శాఖలున్నాయి. వారికి ఒకరంటే ఒకరికి పడదు. ఇక పాశ్చాత్యదేశాలలో జాతి అహంకారం ఎక్కువ, తెల్లవారు గొప్ప, నల్ల జాతీయలు తక్కువ అనే ఫీలింగ్ వారికి ఇప్పటికీ ఉంది. గాంధీ మహాత్ముడిని దక్షిణాఫ్రికాలో రైలు నుంచే గెంటి వేయడమే దేశ స్వాతంత్య్ర పోరాటానికి నాందిగా మారింది. ఇక ఎస్సీలలో కూడా మాల సామాజిక వర్గానికి, మాదిగ సామాజిక వర్గానికి అసలు పడదు.
ఇక విషయానికి వస్తే ఇటీవల ఇండియన్ సంతతికి చెందిన ఓ కుటుంబం లండన్ నుంచి బెర్లిన్ వెళ్లేందుకు బ్రిటీష్ ఎయిర్‌వేస్ సంస్థలో టిక్కెట్ బుక్ చేసుకుంది. కానీ ఆ ఫ్యామిలీలోని ఓ పసిపిల్లాడు ఏడవడంతో సిబ్బంది ఆ ప్యామిలీని దూషించి విమానం నుంచి దించి వేశారు. దీనిపై బాలీవుడ్ వెటరన్ హీరో రిషికపూర్ మండిపడ్డాడు. ఇది నూటికి నూరుశాతం జాతి వివక్షేనని మండిపడ్డాడు. గతంలో నేను కూడా రెండు సార్లు బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణం చేసినప్పుడు కూడా బ్రిటిష్ ఎయిర్‌వేస్ క్యాబిన్ క్రూ సిబ్బంది నాతో దురుసుగా ప్రవర్తించారు. దాంతో ఆ సంస్థ విమానాలలో ఎక్కడం మానివేశాను. మనకి గౌరవం ఇవ్వని ఇలాంటి విమాన సంస్థలలో ఎక్కడం మానివేయండి. జెట్ ఎయిర్‌వేస్, ఎమిరేట్స్ విమానాలలలో ఎక్కితే మనకి గౌరవం దక్కుతుంది అని ఘాటుగా విమర్శించాడు. ఇక షారుఖ్‌ఖాన్ వంటి వారిని కూడా విదేశీ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పలుసార్లు అవమాన పరిచిన సంగతి తెలిసిందే.