Advertisement
Google Ads BL

RX 100 దర్శకుడికి అదిరి పోయే గిఫ్ట్


అనాది కాలం నుండి సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన దర్శకులకు హీరో అండ్ నిర్మాతలు భారీ గిఫ్ట్ లు ఇవ్వడం ఒక ఆనవాయితీగానే మారింది. ఈ మధ్య కాలంలో ఆ గిఫ్ట్ ల సందడి మరింత ఎక్కువైంది. ఎన్టీఆర్.. కొరటాలకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడనే టాక్ వుంది. ఇక మహేష్ భరత్ అనే నేనుకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోని అందరికి ఐ ఫోన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఛలో దర్శకుడు వెంకీ కుడుములకి నాగ శౌర్య వాళ్ళు కారు గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు అలా గిఫ్ట్ లందుకున్న లిస్ట్ మరో యువ డెబ్యూ దర్శకుడు చేరాడు. మొదటి సినిమాకే భారీ గిఫ్ట్ అందుకున్నాడు.

Advertisement
CJ Advs

RX 100 సినిమా చిన్న సినిమాగా విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. విడుదల రోజు యావరేజ్ టాక్ స్ప్రెడయినా.. మెల్లిగా పికప్ అయ్యి నిర్మాతలకు కాసుల పంట పండించింది ఈ అడల్ట్ చిత్రం. యూత్ కే కనెక్ట్ అయ్యేలా అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ చిత్రంతో అజయ్ భూపతికి భారీ క్రేజ్ వచ్చి పడింది. కేవలం యూత్ ని టార్గెట్ చేసి చేసిన ఈ సినిమా కి భారీ కలెక్షన్స్ దండుకుంది. ఒకే ఒక్క సినిమాతో అజయ్ భూపతి క్రేజ్ అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ కి పాకిపోవడమే కాదు మనోడికి ఆ రెండు భాషలనుండి ఆఫర్స్ రావడం విశేషమని చెప్పాలి.

ఇక సినిమాని విజయవంతం చేసినందుకుగాను RX 100  సినిమా నిర్మాత RX 100 దర్శకుడు  అజయ్ భూపతికి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడు. 2  కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఐదు రేట్ల లాభాలతో కలెక్షన్స్ కొల్లగొట్టగొట్టడంతో...నిర్మాత అశోక్ గుమ్మకొండ ఫుల్ ఖుషి అయ్యి అజయ్ కి లక్షల విలువ చేసే జీప్ కార్ ను బహుమతిగా ఇచ్చాడు. మరి ఒకే ఒక్క సినిమాకి అజయ్ భూపతి ఇలా లక్షలు విలువ చేసే కాస్ట్లీ కారుని బహుమతిగా పొందడం అంటే అదృష్టం పట్టినట్లే కదా.. ఇకపోతే అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోలీవుడ్ లో ఉంటుందా.. లేదా బాలీవుడ్ లో ఉంటుందా అనేది కాస్త సస్పెన్స్.

RX 100 Producer gift to Rx 100 Director :

Ajay Bhupathi Gets Car Gift From RX 100 Producer 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs