Advertisement
Google Ads BL

నిజంగా 'గూఢచారి' లానే దోచేస్తున్నాడు!!


అస్సలు అంచనాలు లేకుండా థియేటర్లోకి సైలెంట్గా వచ్చిన స్పై థ్రిల్లర్ గూఢచారి సినిమా డీసెంట్ హిట్ అయ్యింది. అడివి శేష్ హీరోగా శోభిత దూళిపాళ హీరోయిన్ గా.. మధు షాలిని, సుప్రియలు కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడమే కాదు.. ఇప్పటికే పెట్టిన పెట్టుబడిని తెచ్చేసి నిర్మాతలను లాభాల్లో పడేసింది. కేవలం ఆరు కోట్ల లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి హిట్ టాక్ రావడం.. నాగార్జున, కేటీఆర్, లోకేష్ వంటివారు సినిమా బావుందని పాజిటివ్ బజ్ ఇవ్వడంతో.. సినిమా కి కలెక్షన్స్ ఊపందుకున్నాయి. గూఢచారి ఎలాంటి హిట్ అంటే.... తనతోపాటు థియేటర్స్ లోకి వచ్చి హిట్ అయిన చి.ల.సౌ ని తొక్కేసింది అంటేనే ఈ సినిమా రేంజ్ అర్ధమవుతుంది. సుశాంత్ హీరోగా వచ్చిన చి.ల.సౌ కూడా డీసెంట్ హిట్ టాకే వచ్చింది. కానీ గూఢచారి కంటెంట్ ముందు చి.ల.సౌ  సినిమా నిలవలేక చేతులెత్తింది. గూఢచారి సినిమా కన్నా ఎక్కువగా... చి.ల.సౌ సినిమా ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేశారు. కానీ గూఢచారి సినిమా కున్న దమ్ము ముందు చి.ల.సౌ చిన్నబోయింది.

Advertisement
CJ Advs

మరి గత శుక్రవారం నుండి ఏకచత్రాధిపత్యంగా గూఢచారి సినిమా కలెక్షన్స్ స్టడీగా కొల్లగొడుతుంది. ఇక ఈ శుక్రవారం నితిన్ శ్రీనివాస కళ్యాణం, కమల్ విశ్వరూపం సినిమాలు గూఢచారి కలెక్షన్స్ కి కళ్లెం వేస్తాయనుకుంటే.... శ్రీనివాస కళ్యాణం కి సో సో టాక్ వస్తే.. కమల్ విశ్వరూపం 2 అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సో.. ఈ.. వారం అంటే వచ్చే బుధవారం వరకు గూఢచారికి ఎదురు లేదు. మరి అడివి శేష్ థ్రిల్లింగ్ కథతో.. సినిమాని విజయం వైపు నడిపించాడు. చిన్న సినిమాగా తెరకెక్కి సూపర్ కలెక్షన్స్ తో దూసుకెళుతున్న గూఢచారి సినిమా ఈ వీకెండ్ లోను భారీగా కొల్లగొట్టేలా కనబడుతుంది. మరి ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న గీత గోవిందం వచ్చేవరకు గూఢచారి సినిమాకి ఎదురు లేదనేది మాత్రం వాస్తవం.

Goodachari Decent Hit at Box Office :

Study Collections to Goodachari
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs