Advertisement
Google Ads BL

ఆదాశర్మ వెనుక చాలా మ్యాటరుందండోయ్!


సాధారణంగా తల్లిదండ్రులు తామేది కావాలని ఆశపడ్డారో.. అవి నెరవేరకపోతే వాటిని తమ పిల్లల ద్వారా అయినా నెరవేర్చుకోవాలని భావిస్తూ ఉంటారు. ఈ విషయంలో ఆదాశర్మ కూడా అదే కోవలోకి వస్తుంది. నిజానికి ఈమె తల్లి హీరోయిన్‌ కావాలని భావించిందిట. ఈ విషయాన్ని ఆదాశర్మనే తెలిపింది. మా తల్లి కోరికను నేను నెరవేరుస్తున్నాను. ఇంతకాలం మీరందరు మీ ప్రేమాభిమానాలతో నన్ను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కేవలం మీ అభిమానం వల్లనే నేను నా కలను, నా తల్లి కోరికను నెరవేర్చుకుంటూ వస్తున్నాను. మంచి చిత్రాలలో పాత్రలను దక్కించుకుంటున్నానని ట్వీట్‌ చేసింది. 

Advertisement
CJ Advs

ఇక ఆదాశర్మ విషయానికి వస్తే ఈమె బాలీవుడ్‌ మూవీ '1920' చిత్రంతో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత తెలుగులో ఈమె పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా నటించిన 'హార్ట్‌ఎటాక్‌', త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌-అల్లుఅర్జున్‌ల 'సన్నాఫ్‌ సత్యమూర్తి, క్షణం' వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితురాలైంది. ఈ మూడు చిత్రాలు మంచి విజయం సాధించి, ఆదాశర్మకు తెలుగులో క్రేజ్‌ని తీసుకుని వచ్చాయి. ఇక ఈమె సినిమాలలోనే కాదు.. ఆల్బమ్స్‌లో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. కాగా ఈమె తాజాగా ఓ బాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి 'మోహ్‌' అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని తాజాగా ఆదాశర్మ విడుదల చేసింది. ఈ చిత్రంలో నటించే తారాగాణం విషయాలు త్వరలోనే అఫీషియల్‌గా ప్రకటించనున్నారు. ఇక ఇప్పుడు నేను చేస్తోన్న 'మోహ్‌' చిత్రం అందరికీ ఎంతగానో నచ్చుతుంది అని తెలిపింది. 

కాగా ఈ చిత్రానికి కబీర్‌థాపర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదా చేసిన ట్వీట్‌, అందులో ఆ తల్లిగారు హీరో కాలేకపోయింది.. అని చెప్పిన మాటలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దాంతో బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి నెటిజన్లు స్పందిస్తూ ఆదాశర్మకి మద్దతు తెలుపుతున్నారు. ఆదాజీ, సినిమా ఫీల్డ్‌లో రాణించాలంటే కావాల్సింది టాలెంట్‌. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌, గాడ్‌ ఫాదర్స్‌ కాదు.. అని ట్వీట్స్‌ పెడుతున్నారు. 

Adah Sharma Background Revealed:

Story Behind Adah Sharma Cine Entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs