Advertisement
Google Ads BL

ఈ హీరోయిన్స్ రాజశేఖర్‌తో చేయనన్నారా?


ఈమధ్యన టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం లేదు. సీనియర్ హీరోలకు హీరోయిన్స్ కొరత అనే టైటిల్ తో అనేకరకాల న్యూస్ లు వినబడుతూనే ఉన్నాయి. ఈమధ్యన వెంకటేష్ సరసన హీరోయిన్ దొరక్క ఆయనతో సినిమాలు చేసే దర్శకుల పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. తాజాగా హీరో రాజ శేఖర్ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎలాగోలా.. గరుడవేగతో కాస్త లైం టైం లోకొచ్చిన ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆ సినిమా తర్వాత భారీ గ్యాప్ తో మరో సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీగా ఉన్నాడు. కానీ ఈయన పక్కన నటించే  హీరోయిన్ సెట్ కాక ఈ సీనియర్ హీరో బిక్కమొహం వేస్తున్నాడు.

Advertisement
CJ Advs

గరుడవేగ అప్పుడే ఆయన సరసన ఎవరు దొరక్క ప్రవీణ్ సత్తారు పూజా కుమార్ ని తీసుకొచ్చాడు. తాజాగా నాని నిర్మాతగా చేసిన అ ! సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ తన తదుపరి ప్రాజెక్ట్ ని మొదలుబెట్టబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ తో అన్ని పనులను చక్కనెట్టుకుని.. సెట్స్ మీదకెళ్లే టైంలో రాజశేఖర్ కి హీరోయిన్ దొరక్క ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి వెనుకాముందు ఆడుతున్నారు. అయితే రాజశేఖర్ కి జోడిగా  ఈమధ్యన ఫామ్ లోకొచ్చిన  కాజల్ అగర్వాల్ ని సంప్రదించగా.. కాజల్ సీనియర్ హీరో రాజశేఖర్ పక్కన నటించడానికి కిందా మీదా అవుతుంది.

ఒకసారి సీనియర్ హీరో చిరుతో జోడి కట్టినందుకే ప్రస్తుతం తనకి అవే రోల్స్ రావడంతో.. ఇక సీనియర్ హీరోల సినిమాల్లో నటించకూడదని  కాజల్ డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు. అందుకే వెంకీ సరసన ఆఫర్ ని కాలదన్నిన కాజల్ ఇప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ కి కూడా హ్యాండ్ ఇచ్చిందనే న్యూస్ నడుస్తుంది. ఇక శ్రియని సంప్రదించగా.. ఆమె కూడా కాదన్నదంటున్నారు. మరి రాజశేఖర్ కి హీరోయిన్ లేక ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లేట్ అవడం కాస్త విచిత్రంగానే అనిపిస్తుంది. మరి ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో పాటుగా నిర్మాతలు కూడా రాజశేఖర్ కి హీరోయిన్ ని సెట్ చేసే వేటలో తలమునకలై ఉన్నారు.

Why Kajal, Shriya rejected Rajashekar film? :

Top Heroines Rejects Senior Hero Rajasekhar Offer  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs