Advertisement
Google Ads BL

బంగ్లా పేరు వెనుక చాలా కథ ఉంది..!


బాలీవుడ్‌ వెటరన్‌ స్టార్‌, ప్రస్తుత ఎంపీ శత్రుఘ్నుసిన్హా. ఈయనకు శ్రీరాముడు అంటే బాగా ఇష్టం. అందుకోసమే ఆయన బిజెపిలో చేరి బాబ్రీమసీద్‌ స్థానంలో రామాలయం కట్టాలని నినదిస్తూ వస్తున్నారు. ఇక ఈయన గారాల పట్టి, కుమార్తె సోనాక్షి సిన్హా బాలీవుడ్‌లో టాప్‌ నటి. సల్మాన్‌ఖాన్‌ నటించిన 'దబాంగ్‌' చిత్రం ద్వారా ఈమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత పలు హిట్‌ చిత్రాలలో నటించింది. దక్షిణాదిలో కూడా ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'లింగ' చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించింది. అప్పట్లో ఈమెకి ప్రభుదేవాతో కూడా ఎఫైర్లు ఉన్నాయని వార్తలు హల్‌చల్‌ చేశాయి. చాలా బొద్దుగా ఉండటంతో ఈమె త్వరగానే కనుమరుగైంది. ఈమధ్యకాలంలో ఆమెకి చాన్స్‌లు, హిట్స్‌ తగ్గాయి. 

Advertisement
CJ Advs

ఇక ఈమె తాజాగా ఓ సింగింగ్‌ షోకి హాజరైంది. ఇందిరా దాస్‌ అనే సింగర్‌ ప్రతిభకు ఈమె ముగ్దురాలైంది. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా సోనాక్షి ఇందిరా దాస్‌, ఆమె తల్లితో కాసేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా ఇందిరాదేవి తల్లి 'మీ ఇంటికి రామాయణ్‌ అనే పేరు ఎందుకు పెట్టారు?' అని ప్రశ్నించింది. దీనికి సోనాక్షి సమాధానం ఇస్తూ, ఎంతో కాలంగా చాలా మంది నన్ను ఇదే అడుగుతున్నారు. ఇప్పుడు మా ఇంటి పేరు వెనుక ఉన్న రహస్యాన్ని మీకు చెబుతాను. మా తాతకి నలుగురు కుమారులు. వారి పేర్లు రామ్‌, లక్ష్మన్‌, భరత్‌, ఇక మా నాన్నగారి పేరు శత్రుఘ్నుడు. 

ఇక నా అన్నదమ్ములు లవ్‌, కుశ్‌. దాంతో మా ఇల్లే ఒక రామాయణం అయిపోయింది. ఆ విధంగా చూసుకుంటే నేను, మా అమ్మ పూనంలు మాత్రమే బయటి వారం అనిపిస్తోంది. ఒక్కోసారి మహాభారతంకి చెందిన యుద్ద సన్నివేశాలు కూడా 'రామాయణ్‌'లో సృష్టించగల సత్తా మాకుంది' అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. 

Sonakshi Sinha reveals family secret behind naming her house Ramayan:

Sonakshi Sinha reveals family secret
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs