నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ వయసులో కూడా తాను యంగ్ స్టార్స్ కంటే యాక్టివ్‌గా చిత్రాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తున్నారు. 'గౌతమి పుత్రశాతకర్ణి, పైసావసూల్, జైసింహా' వంటి వరుస చిత్రాలు చేశాడు. ఆ తర్వాత ఆయన వెంటనే మరోసారి నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాతగా తనతో రెండో చిత్రంగా 'చెన్నకేశవరెడ్డి'ని తీసిన వినాయక్‌కి ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి. కానీ ఇది ఆలస్యం అవుతుందనే ఆలోచనతో స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న తన తండ్రి బయోపిక్‌గా 'ఎన్టీఆర్' చిత్రం చేస్తున్నాడు.
దీనితో మొదటి సారి సాయికొర్రపాటి, విష్ణు ఇందూరిలతో కలిసి నిర్మాణ భాగస్వామిగా మారి తన వందో చిత్రం 'గౌతమి పుత్రశాతకర్ణి'ని దర్శకత్వం వహించిన క్రిష్‌ని తేజ స్థానంలో తీసుకున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా వేగంగా సాగుతోంది. ఈసారి సంక్రాంతి రేసులో ఈయన 'ఎన్టీఆర్' చిత్రం విడుదల కానుంది. ఆవెంటనే ఆయన 'సింహా, లెజెండ్'వంటి తనకు రెండు బ్లాక్‌బస్టర్స్ అందించిన, తనకి అచ్చివచ్చిన పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఆ వెంటనే ఓకే చేశాడు. ఇప్పుడు వినాయక్ కూడా బాలయ్యకు సరిపడా తన కథ, హీరో పాత్ర, కథనాలను మార్పులు చేర్పులు చేసి బాలయ్యకి వినిపించి గ్రీన్‌సిగ్నల్ అందుకున్నాడు.
ఈ విషయం గురించి దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ, 'బాలకృష్ణ గారి కోసం తయారు చేసిన స్క్రిప్ట్ పక్కాగా పూర్తయింది. నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది. స్క్రిప్ట్ పర్‌ఫెక్షన్ కోసం ఎక్కువ సమయంలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంతా సిద్దంగా ఉంది' అని తెలిపాడు. మరి బాలయ్య 'ఎన్టీఆర్' చిత్రం తర్వాత బోయపాటి శ్రీను చిత్రం చేస్తాడా? ముందుగా వినాయక్ చిత్రం చేస్తాడా? అనేది వేచిచూడాలి. మొత్తానికి బోయపాటితో పాటు వినాయక్‌కి కూడా బాలయ్య గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది.