Advertisement
Google Ads BL

మళ్లీ దోచుకునేలానే వున్నాడు..!!


సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్‌ 'నన్నుదోచుకుందువ‌టే' చిత్రంలోని 'మౌనం మాటతోటి'... లిరికల్ వీడియోకు సూపర్బ్ రెస్పాన్స్. 

Advertisement
CJ Advs

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా, సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'నన్ను దోచుకుందువటే'.. ఈ చిత్రంలోని 'మౌనం మాటతోటి'.... అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. విడుదల చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అజనీష్ లోకనాథ్ సంగీతమందించడంతో పాటు గాయకుడి గాను మెప్పించాడు. ప్రముఖ రచయిత శ్రీమణి సాహిత్యమందించారు. విజయ్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫి చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ పాటతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉండడం... హీరో, హీరోయిన్ పెర్ ఫార్మెన్స్ ఫ్రెష్ గా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆఫీస్ మొత్తం భయ‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెనీ మేనేజ‌ర్ గా సుధీర్‌బాబు న‌టించ‌గా.. అల్ల‌రి చేసే గ‌డుస‌మ్మాయి సిరి పాత్ర‌లో హీరోయిన్ న‌భా న‌టేశ్ క‌నిపించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రెడీ అవుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నికార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌కచ‌వితి ప‌ర్వ‌దినాన సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేయాటానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న స్పెషల్ ప్రీమియర్ షోస్ ప్లాన్ చేస్తున్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ... సుధీర్ బాబు గారు హీరోగా సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ లో నిర్మిస్తున్న 'నన్నుదోచుకుందువ‌టే' చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ని జూలై 14న రిలీజ్ చేశాం. చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు 'మౌనం మాటతోటి' లిరికల్ వీడియోను విడుదల చేశాం. అజనీష్ అద్బుతమైన సంగీతం అందించారు. ఈ పాటను ఆయనే పాడటం విశేషం. శ్రీమణి గారు మంచి మెలోడియస్ సాహిత్యం అందించారు. తాజాగా విడుదల చేసిన పాటతో ఈ చిత్రంలోని మిగిలిన పాటలు ఎలా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మ్యూజికల్ గా మంచి ఆల్బమ్ అందించారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ కి అంద‌రూ క‌నెక్ట్ అయ్యారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల చేసేందుకు సిద్ధమౌతున్నాం. సెప్టెంబర్ 12 నే ప్రీమియర్ షోస్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. సమ్మోహనం లాంటి మంచి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత సుధీర్‌బాబు గారి నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌టంతో ప్రేక్ష‌కుల నుంచి అంచ‌నాలు భారీగా వున్నాయి. సుధీర్ బాబు గారి ఫస్ట్ ప్రొడక్షన్ లో నన్ను నమ్మి, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు.

సమ్మోహనం సూపర్ హిట్ అయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన సుధీర్ బాబు గారికి స్పెషల్ గా థాంక్స్ తెలియజేస్తున్నాను. సినిమా అనుకున్న ప్రకారం పూర్తి చేశాం. సినిమా మీదున్న నమ్మకంతో ప్రమోషన్ ను కూడా భారీగా ప్లాన్ చేశాం. అందుకు ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లో తెలుగు ప్రేక్ష‌కులంద‌రినీ ఇన్‌వాల్వ్ చేస్తున్నాము. అలాగే ఈ చిత్రం ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ ఎక్క‌డా త‌గ్గ‌కూడ‌దనే సంకల్పంతోనే సుధీర్‌బాబు గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. అని అన్నారు.

Superb Response to Nannu Dochukunduvate Movie Song:

Nannu Dochukunduvate Movie  Song Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs