హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'లై' సినిమాలో ముసుగులో ఉన్న విలన్ అర్జున్ ని పట్టుకునే క్రమంలో అమెరికా వెళ్లి మరీ.. అక్కడ ఒక అమ్మాయి ప్రేమలో పడే.. పాత్రలో నితిన్ బాగానే నటించినా.. ఆ సినిమా బాగా తెలివిగల వారికే అంటే కేవలం క్లాస్ ఆడియన్స్ ని మాత్రమే ఆకట్టుకోవడంతో... బి సి సెంటర్స్ లో లై సినిమాకి నెగెటివ్ టాక్ రావడంతో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాలో మేఘ ఆకాష్ తో కలిసి నటించిన నితిన్ మళ్ళీ.. తన తదుపరి సినిమా లోను మేఘ ఆకాష్ కి అవకాశం ఇచ్చాడు. త్రివిక్రమ్ కథ మీద నమ్మకంతో.. నితిన్, కృష్ణ చైతన్య అనే కొత్త దర్శకుడితో 'ఛల్ మోహన్ రంగ' లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నటించాడు. కానీ సక్సెస్ కాలేదు.
ఇక నాకు హిట్స్ పడడం లేదు.. హిట్ సినిమా కావాలంటే మీ బ్యానర్ లో ఒక సినిమా చేస్తానని నితిన్, దిల్ రాజు దగ్గరికి వెళ్లి అడగడంతో.. దిల్ రాజు, నితిన్ ని శతమానంభవతి తో హిట్ కొట్టిన సతీష్ వేగేశ్నకి అప్పగించాడు. మరి శతమానంభవతి సినిమాని కుటుంబాలకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంతో ఆ సినిమా హిట్ అయ్యింది. అలాగే సతీష్.. నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అందుకే నితిన్ హీరోగా మళ్ళీ సతీష్ కుటుంబ కథా చిత్రాన్ని ఎన్నుకున్నాడు. పెళ్లి కాన్సెప్ట్ తో ఎన్ని కథలు తెరకెక్కినా.... తీసే విధానంలో కొత్తదనం ఉంటే.. ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడు ఆదరిస్తారు. మరి సతీష్.. పెళ్లి కాన్సెప్ట్ తో శ్రీనివాస కళ్యాణం సినిమాని భారీ తారాగణంతో కుటుంబ కథా చిత్రంగా మలిచాడు. ఈ శుక్రవారమే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాలో నితిన్ ని మరీ.. మంచి వాడిలా చూపెట్టడం.. అలాగే హీరోయిన్ రాశి ఖన్నా కూడా చూడగానే నితిన్ తో లవ్ లో పడిపోవడం.. కథలో బలం లేకపోవడం, ఎడిటింగ్ లో లోపాలు, ఇంకా ఈ సినిమా మొత్తం వెతికినా కామెడీ అనేది కనిపించకపోవడం.. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ చప్పగా ఉండడం ఇలా చాలా నెగెటివ్ పాయింట్స్ ఈ సినిమాలో కనబడ్డాయి.
ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే... నితిన్ నటనతో పాటుగా... సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ హైలెట్ అనేలా ఉండడం... దిల్ రాజు నిర్మాణ విలువలు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా కనబడుతున్నాయి. మరి క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి యావరేజ్ మార్కులే వేశారు. సినిమాలో భారీ తారాగణం ఉన్నప్పటికీ... చాలా పాత్రలు అలా వచ్చి వెళ్లిపోవడం... పెళ్లి గురించి మరీ సాగదీతగా చెప్పడం కూడా ప్రేక్షకులకు కాస్త బోర్ కొట్టే విషయమే అంటున్నారు. ఏది ఏమైనా శతమానంభవతి సినిమా అంత శ్రీనివాసుడి కళ్యాణం లేదని ప్రేక్షకుడి అభిప్రాయం. అంటే నితిన్ రెండు ప్లాప్స్ తర్వాత మళ్ళీ యావరేజే కొట్టాడు. పాపం దిల్ రాజుని నమ్ముకున్న నితిన్ కి పెద్దగా ఒరిగింది ఏమి కనబడడంలేదు.